Begin typing your search above and press return to search.

బ‌ర్త్‌ డేకి ప్ర‌భాస్ రెండు కానుక‌లు!?

By:  Tupaki Desk   |   23 Sep 2018 5:44 AM GMT
బ‌ర్త్‌ డేకి ప్ర‌భాస్ రెండు కానుక‌లు!?
X
డార్లింగ్ ప్ర‌భాస్ కొత్త క‌బురేం చెబుతాడు? మ‌త్తెక్కే - పిచ్చెక్కే ఆ శుభ‌వార్త ఎప్పుడు చెబుతాడు? ఇంత‌కీ సాహో తాజా అప్‌ డేట్ ఎప్పుడు? ఇంత‌కీ ఈ సీనియ‌ర్ ఎలిజిబుల్‌ బ్యాచిల‌ర్ పెళ్లి క‌బురు ఏది? .. ఇవీ అభిమానుల గుండెల్లో నిరంత‌రాయంగా మెదిలే ప్ర‌శ్న‌లు. ప్ర‌భా.. అస‌లు దేనికీ స్పందించ‌డేం? డార్లింగ్ అంటే ఫ్యాన్స్‌ కు ఉన్న పిచ్చ ప్రేమాభిమానాలు అలా ఆలోచింప‌జేస్తాయి. అయితే ప్ర‌భాస్ మాత్రం అస్స‌లు మినిమం క్లూ కూడా ఇవ్వ‌డు. ఫ్యాన్స్‌ ని ఊరిస్తూనే ఉంటాడు త‌ప్ప సామాజిక మాధ్య‌మాల్లో అయినా ఇదీ అని క్లారిటీ ఇవ్వ‌డు.

అయితే ప్ర‌భాస్ అభిమానుల ముందుకు వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అందుకు ఇంకెంతో టైమ్ లేనేలేదు. 23 అక్టోబ‌ర్ డార్లింగ్ బ‌ర్త్‌ డే. ఆరోజు త‌ప్ప‌నిస‌రిగా అభిమానుల‌కు అభివాదం చేయాల్సి ఉంటుంది. `సాహో` షెడ్యూల్స్ పేరుతో ఇన్నాళ్లు దేశ‌ - విదేశాల్లో బిజీబిజీగా గ‌డిపాడు. షూటింగుల హ‌డావుడి త‌ప్ప వేరే ఏదీ లేదు. కానీ బ‌ర్త్‌ డే వేళ మాత్రం డార్లింగ్ త‌ప్ప‌నిస‌రిగా అభిమానుల‌కు ఏదో ఒక శుభ‌వార్త చెప్పాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా పెళ్లి గురించిన అస‌లు మాట చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్ప‌టికే 38వ‌య‌సు బ్యాచిల‌ర్ విష‌యంలో పెద‌నాన్న కృష్ణంరాజు చాలానే కంగారు ప‌డుతున్నారు. కుటుంబ‌మంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. పిల్ల‌ను వెతికాం.. ప్ర‌భాస్ ఓకే చెప్పాలి అంతే! అంటూ కృష్ణంరాజు ప‌దే ప‌దే మీడియా లైవ్‌ లోనే చెబుతున్నారు. కానీ ప్ర‌భాస్ నుంచి మాత్రం స్పంద‌న లేనేలేదు.

మ‌రోవైపు అనుష్క‌తో డార్లింగ్ ఎఫైర్ .. త‌న‌నే పెళ్లాడుతాడా? అంటూ ఉత్త‌రాది మీడియాలు ప‌దే ప‌దే క‌థ‌నాల్ని ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్డీటీవీ - ఒడిస్సా టీవీ - న్యూస్ 18 - భార‌త్ టుడే - జూమ్ చానెల్ ఒక‌టేమిటి ఏ చానెల్ పెట్టినా డార్లింగ్ పెళ్లి గోలే. అందుకే ఇక ప్ర‌భాస్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది. ఈ ఒత్తిడి త‌ట్టుకోలేక‌ పెద‌నాన్న కు ఈసారి క్లారిటీ ఇచ్చేస్తున్నాడ‌ట‌! అన్న మాట కూడా మ‌రోవైపు వినిపిస్తోంది. ఈ బ‌ర్త్‌ డే వేళ అమ్మాయి వివ‌రాలు చెబుతార‌ట‌. ఇక‌పోతే దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌ తో రాజీ లేకుండా నిర్మిస్తున్న `సాహో` అప్‌ డేట్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆత్రుత‌ను దృష్టిలో ఉంచుకుని అభిమానుల్ని నిరాశ‌ప‌ర‌చ‌కుండా ఈసారి `సాహో` కొత్త లుక్ రిలీజ్ చేసే ప్లాన్‌ లో యువి క్రియేషన్స్ బిజీగా ఉంద‌ని చెబుతున్నారు. డార్లింగ్‌ కి ఏదో ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలి కాబ‌ట్టి అందుకు యువి సంస్థ ఇప్ప‌టినుంచే పెద్ద ప్లాన్ చేస్తోందిట‌. వ‌చ్చే స‌మ్మ‌ర్‌ లో సాహో రిలీజ్ ఉంటుంది కాబ‌ట్టి చాలా ముందు నుంచి అభిమానుల్నియంగేజ్ చేయాల‌న్న ప్లాన్‌ లోనూ స‌ద‌రు కంపెనీ ఉంద‌ని తెలుస్తోంది. జ‌స్ట్ వెయిట్ ... డార్లింగ్ స్వ‌యంగా ఏదైనా చెబుతాడేమో!! క్లూ ఇస్తాడేమో?