Begin typing your search above and press return to search.

బాహుబలి, శివుడు కండలు పెంచాల్సిందే

By:  Tupaki Desk   |   31 July 2015 11:37 AM GMT
బాహుబలి, శివుడు కండలు పెంచాల్సిందే
X
బాహుబలి : ది బిగినింగ్‌ భారీ సక్సెస్‌ సాధించింది. 500కోట్ల వసూళ్ల క్లబ్‌ సినిమాగా నిలిచింది. ఇక బాహుబలి : ది కన్‌ క్లూజన్‌ గురించే చిత్రయూనిట్‌ సహా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ప్రభాస్‌, రానా, అనుష్క తదితరులు తమ శరీరాకృతిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అనుష్క ఇప్పట్నుంచే జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకుంటోంది. ప్రభాస్‌ తొలిభాగం షూట్‌ పూర్తవ్వగానే రిలాక్సయిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ చూసినా స్లిమ్‌ లుక్‌ లో కనిపించాడు.

అయితే ఇక సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలవుతుంది కాబట్టి ఇప్పట్నుంచే మళ్లీ కసరత్తుల్లో స్పీడ్‌ పెంచాల్సి ఉంది. పైగా అమరేంద్ర బాహుబలి యుద్ధ విన్యాసాలు గొప్పగా చేశాడన్న పేరొచ్చినా మజిల్‌ పవర్‌ ని ఓపెన్‌ చేసి చూపించడంలో ఫెయిలయ్యాడన్న విమర్శలొచ్చాయి. అక్కడ యుద్ధ రంగంలో కవచo అతడి దేహాకృతిని పూర్తిగా కవర్‌ చేసేసింది. ఎంతసేపూ ఆయుధ లాఘవం తప్ప మెలితిరిగిన కండల్ని చూపించే ప్రయత్నం చేయలేదు. శివుడు కూడా చొక్కా విప్పి శివలింగాన్ని ఎత్తే సన్నివేశంలో తప్ప ఎక్కడా మెలితిరిగిన కండల్ని, చొక్కా లేకుండా చూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఇక రెండో భాగంలో అలా కనిపిస్తే లాభం లేదు. అది అభిమానులకు కన్నుల పండువ చేయదు.

రెండో పార్ట్‌ కథని విజయేంద్ర ప్రసాద్‌ తో కలిసి రాజమౌళి మరింత రంజుగా తయారు చేయించే పనిలో ఉన్నాడు. కాబట్టి అందుకు తగ్గట్టే ప్రభాస్‌ న్యూ లుక్‌ కోసం పరితపించాల్సిందే. పైగా బాహుబలి, శివుడు రెండు పాత్రలు తెరపై కనిపిస్తాయి కాబట్టి రెండిటిలో వేరియేషన్‌ చూపించాల్సి ఉంటుంది. రాజమౌళి, ప్రభాస్‌ అండ్‌ గ్యాంగ్‌ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.