Begin typing your search above and press return to search.

జక్కన్న సెంటిమెంటును ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   16 July 2018 9:23 AM GMT
జక్కన్న సెంటిమెంటును ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?
X
రాజమౌళి లాంటి దర్శకుడితో ఒక సినిమా చేయాలని ప్రతి ఆర్టిస్టూ తపిస్తాడు. కానీ ఆయనతో కలిసి పని చేశాక ఆ తర్వాత కెరీర్ ఏమవుతుందో అన్న కంగారు కూడా హీరో హీరోయిన్లలో ఉంటుంది. అందుక్కారణం.. రాజమౌళితో సినిమా చేశాక వెంటనే ఒక ఫ్లాప్ తప్పదన్న సెంటిమెంటే. జక్కన్న తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదలుకుని.. ప్రభాస్.. సునీల్.. నాని.. ఇలా చాలామంది హీరోలు రాజమౌళి సినిమా తర్వాత వెంటనే ఫ్లాపులు ఎదుర్కొన్న వాళ్లే. దీంతో ఇప్పుడుమరోసారి ప్రభాస్ కంగారు పడుతున్నట్లున్నాడు. జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఐతే సెంటిమెంటు కొనసాగి.. ప్రభాస్ తర్వాతి సినిమా ‘సాహో’ ఫలితం కూడా తేడా కొడుతుందేమో అన్న కంగారు అభిమానుల్లో ఉంది.

ఐతే ప్రభాస్ మాత్రం ఈ సెంటిమెంటును మార్చాలని పట్టుదలతో ఉన్నాడట. ‘సాహో’తో ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నప్రభాస్.. అందుకోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడట. సినిమా ఎంత ఆలస్యమైనా పర్వాలేదని.. కానీ క్వాలిటీ విషయంలో మాత్రం తేడా రాకూడదని అంటున్నాడట. దర్శకుడు సుజీత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఔట్ పుట్ పర్ఫెక్టుగా ఉండేలా చూస్తున్నాడట. రీటేక్ లకు.. రీషూట్లకు ప్రభాస్ ఏమాత్రం వెనుకాడట్లేదని సమాచారం. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఐతే ప్రభాస్ మాత్రం లేటు విషయంలో ఏమాత్రం కంగారు పడట్లేదని సమాచారం. మరి ఇంత పట్టుదలగా ఉన్న ప్రభాస్.. రాజమౌళి సెంటిమెంటును బ్రేక్ చేస్తాడేమో చూడాలి.