ప్రభాస్ నాలుగు నెలల టార్గెట్

Sat Jan 13 2018 21:53:58 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకు 18 సినిమాల్లో కనిపించాడు. 2001 లో ఈశ్వర్ సినిమా ద్వారా పరిచయం అయిన ప్రభాస్ 2013 మిర్చి సినిమా వరకు ఏ ఇయర్ లో గ్యాప్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే బాహుబలిని ఒకే చేశాడో అప్పుడే ప్రభాస్ నెక్స్ట్ ఏ సినిమాను ఒప్పుకోలేదు. కొన్ని కథలను విన్నా కూడా నాలుగేళ్ల వరకు కుదరదని చెప్పేశాడు. బాహుబలి మొదటి పార్ట్ తరువాత  వేరే కథను చేసే ఛాన్స్ వచ్చినా కూడా చేయలేదు.ఎందుకంటే బాహుబలి మూడ్ లో నుంచి బయటకు రావడం ప్రభాస్ కి నచ్చలేదు. అందుకే నాలుగేళ్ల వరకు ఒక్క సినిమాను కూడా ఒకే చేయలేదు. అయితే ఫైనల్ గా యూవీ నిర్మాతలే ముందుండి కథను ఒకే చేయడంతో సాహో ని తొందరగా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సాహో సినిమా తప్పకుండా విజయం సాధించాలని తెగ కష్టపడుతున్నాడు. అయితే మరో కథను కూడా ప్రభాస్ ఇదే ఇయర్ లో స్టార్ చేసి నాలుగు నెలల్లో పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట.

జిల్ డే దర్శకుడు రాధా కృష్ణ చెప్పిన మెలోడీ లవ్ స్టోరీ ప్రభాస్ కి చాలా నచ్చిందట. అందుకే ఓ వైపు యాక్షన్ కథ మరో వైపు సింపుల్ లవ్ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్నాడట. కృష్ణం రాజు సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్ ప్రొడక్షన్ లో సినిమాని నిర్మించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. చివరగా ఈ బ్యానర్ లో ప్రభాస్ బిల్లా అనే సినిమాను చేశాడు. ఇక ఫైనల్ గా ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలను పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడు. మరి రెబల్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.