షాక్: ప్రభాస్ షాకింగ్ లుక్

Sat Dec 08 2018 10:48:31 GMT+0530 (IST)

వ్వాట్ హ్యాపెన్డ్ డార్లింగ్?  ఎందుకీ హర్రీ?  ఎందుకీ టెన్షన్ టెన్షన్?  కొత్తలుక్ తో సడెన్ షాకింగ్ సర్ ప్రైజ్?  ప్రస్తుతం ముంబై నగరంలో సాగుతున్న ఆసక్తికర డిబేట్ ఇది. ఉన్నట్టుండి బాహుబలి నగరంలో దిగేసరికి జనం ఒకటే కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇంతకీ డార్లింగ్ ఇలా ఎందుకు దిగినట్టు? అతడి టార్గెట్ ఏంటి?  పైగా ఏదో హర్రీలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు... టెన్షన్ టెన్షన్ గానే ఉన్నాడు.వీటన్నిటినీ మించి డార్లింగ్ లో ఏదో కొత్త మార్పు కనిపిస్తోంది. అతడి రూపం పూర్తిగా మారిపోయింది. తలకట్టు గుర్తుపట్టలేం.. పసుపు రంగు కళ్లద్దం కొత్త లుక్ తెచ్చేసింది. మొత్తానికి డార్లింగ్ మునుపటిలా లేడు. అంతా కొత్తగా మారిపోయాడు. కొత్తకొత్తగా అనిపిస్తున్నాడు. అసలింతకీ ఏమైంది ప్రభాస్? ఇక్కడ అభిమానుల్లో ఒకటే టెన్షన్ టెన్షన్.

కొందరైతే వైరల్ భయానీ పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ లు పెడుతున్నారు. బాహుబలి ఆగయా.. అని ఒకరు వ్యాఖ్యానిస్తే ఈసారి షారూక్ ని కొట్టేయడమెలా అని ఆలోచిస్తున్నాడు! అంటూ ఇంకో అభిమాని కామెంట్ ని పోస్ట్ చేశాడు. లేదూ ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నాడని వేరొక అభిమాని తన అభిమానం చాటుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ వాలకం చూస్తుంటే తేడాగానే ఉంది. అన్నట్టు కరణ్ జోహార్ దర్శకత్వంలో నటిస్తాడని ఇదివరకూ చెప్పుకున్నాం. పైగా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు బాహుబలుడు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అసలు ముంబైకి ఎందుకు వెళ్లాడు? అన్నదానికి ఇప్పుడిప్పుడే చిక్కుముడి వీడుతోంది. ఓవైపు సాహో షూటింగ్ లో పాల్గొంటూనే - కాఫీ విత్ కరణ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడని అభిమానులు ఊహిస్తున్నారు. చూద్దాం డార్లింగే అసలు విషయం చెబుతాడేమో?