Begin typing your search above and press return to search.

'సాహో' సమ్మర్‌ రేస్‌ లో లేనట్లేనా?

By:  Tupaki Desk   |   18 Nov 2018 12:01 PM GMT
సాహో సమ్మర్‌ రేస్‌ లో లేనట్లేనా?
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ - సుజీత్‌ ల కాంబినేషన్‌ లో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో వంశీ మరియు ప్రమోద్‌ లు అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సాహో’ చిత్రం 2019 సమ్మర్‌ లో వస్తుందని ఇంత కాలం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. సమ్మర్‌ లో ఖచ్చితంగా ప్రభాస్‌ సందడి చేస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే అని చెప్పాలి. ఎందుకంటే ‘సాహో’ చిత్రం విడుదల తేదీలో మార్పు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొదట ఈ చిత్రాన్ని 2019 సమ్మర్‌ లో అనుకున్న మాట వాస్తవమే కాని, ప్రస్తుతం షూటింగ్‌ పోగ్రెస్‌ మరియు సమ్మర్‌ పోటీ నేపథ్యంలో సినిమాను మూడు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయమై చిత్ర యూనిట్‌ ఆలోచనలో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 2019 స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల బెనిఫిట్‌ పొందాలని నిర్మాతల ప్లాన్‌ గా తెలుస్తోంది. హడావుడిగా కాకుండా కాస్త నిదానంగానే విడుదల చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళం - హిందీ - మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. భారీ బడ్జెట్‌ చిత్రం అవ్వడంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి ప్రమోషన్‌ చేయడంతో పాటు - మంచి బిజినెస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారట. మరో వైపు ప్రభాస్‌ - రాధాకృష్ణ ల రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ తెరకెక్కుతూనే ఉంది. ‘సాహో’ ఒక యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కాగా - తదుపరి చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ అంటూ సమాచారం అందుతోంది.