సాహో: కారు ఇత్తడి అయిపోయిందే!

Sun May 19 2019 22:25:12 GMT+0530 (IST)

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ప్రస్తుతం చివరి దశలో ఉంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ముంబైలోని అంబి వ్యాలీ లో ఈ షూటింగ్ జరుగుతోందని సమాచారం.  ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మురళి శర్మ నిన్న షూటింగ్ ముగిసిన తర్వాత తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు.ఛేజింగ్ సీన్ల చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు.  ఇక వీడియోలో ఛేజ్ సీన్ లో ధ్వంసమైన కారును టోయింగ్ వ్యాన్ పై ఎక్కించి తీసుకెళ్తున్న వీడియో ఉంది.  ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం దాదాపుగా రూ. 90 కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం.  ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో జరుగుతున్నాయి.  ఈ సినిమా కోసం దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ భారీ హైలైట్ కానుంది.

దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున ఈ సినిమా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు  శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ కాగా నీల్ నితిన్ ముఖేష్.. జాకీ ష్రాఫ్.. మందిరా బేడీ.. అరుణ్ విజయ్.. ఎవెలిన్ శర్మ.. వెన్నెల కిషోర్.. మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను ఆగష్టు 15 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .  ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్  చేసిన షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1.. చాప్టర్ 2 వీడియోలు సినిమాపై క్రేజ్ ను ఒక్కసారి ఆకాశాన్ని తాకేలా చేసిన సంగతి తెలిసిందే.  మరి ఈ వీడియోపై కూడా ఒక లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి