Begin typing your search above and press return to search.

రాజమౌళిని అలా ఎప్పుడూ చూడలేదు-ప్రభాస్

By:  Tupaki Desk   |   25 Feb 2017 7:42 AM GMT
రాజమౌళిని అలా ఎప్పుడూ చూడలేదు-ప్రభాస్
X
ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ‘బాహుబలి’ ప్రభాస్ విగ్రహం పెట్టబోతున్నారన్న వార్త గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు అమితానందం కలిగించింది. ఇప్పటిదాకా ఎవరో బాలీవుడ్ నటుడి విగ్రహం పెడుతున్నారంట అని వినడమే తప్ప.. ఒక తెలుగు హీరోకు అందులో చోటు దక్కడం గురించి వినలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా మనకు రాలేదు. అలాంటిది మన ప్రభాస్ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్స్‌ లో పెడుతున్నారనగానే ముందు నమ్మశక్యంగా అనిపించలేదు. అది నిజమే అని తెలిశాక అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. మరి సామాన్య జనాల పరిస్థితే అలా ఉంటే.. ప్రభాస్.. రాజమౌళి ఆ వార్త తెలిసినపుడు ఎలా ఫీలయ్యారు. ఆ సంగతులు ప్రభాస్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఒక రోజు నా ఫ్రెండు ఫోన్ చేశాడు. టుస్సాడ్స్ మ్యూజియంలో మన విగ్రహం పెడుతున్నారని కంగారు కంగారుగా చెప్పాడు. ఒకటికి రెండుసార్లు అతనీ విషయం చెప్పినా నాకు అర్థం కాలేదు. కొంచెం నెమ్మదిగా చెప్పమన్నాను. తర్వాత విషయం అర్థమైంది. నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. టుస్సాడ్స్ లో మన విగ్రహం పెట్టడం ఏంటి అనుకున్నాను. అప్పటికి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం. వెంటనే వల్లి గారికి ఫోన్ చేసి రమ్మన్నాను. ఆమె ఏమైందో ఏంటో అని కంగారు పడ్డారు. రాజమౌళి గారిని.. మిగతా వాళ్లను కూడా కారవాన్లోకి పిలిచాను. విషయం చెప్పాను. రాజమౌళి గారిలో ఎప్పడూ చూడనంత ఆనందం కనిపించింది. నోరు వెడల్పు చేసుకుని చాలా సంతోషంగా ముఖం పెట్టారు. టుస్సాడ్స్ లో విగ్రహం అంటే అది నాకు పెట్టినట్లు కాదు. అది ‘బాహుబలి’కి దక్కిన గౌరవం’’ అని ప్రభాస్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/