హాలీవుడ్ ని లైట్ తీసుకున్న ప్రభాస్

Fri Apr 21 2017 10:48:05 GMT+0530 (IST)

ప్రభాస్ ఇప్పుడు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నాలుగేళ్లకు పైగా బాహుబలి కోసం వెచ్చించిన ప్రభాస్.. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సక్సెస్ సాధించడంపై అనుమానాలు లేవు కానీ.. దాని రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందనేదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పాయింట్. ఓ సినిమా కోసం ఏకంగా నాలుగైదేళ్లు కేటాయించడం మాత్రం.. ఎవరూ చేయలేని ఓ సాహసంగా ఒప్పుకోవాల్సిందే.

ప్రభాస్ పడ్డ ఈ కష్టాన్ని టాలీవుడ్.. బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా కూడా గుర్తించింది. గ్లోబల్ గా కూడా పలు ప్రశంసలు అందుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. రీసెంట్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేకర్స్ కూడా బాహుబలి కోసం ప్రభాస్ చేసిన త్యాగం.. పడ్డ కష్టాన్ని ప్రశంసించారంటూ న్యూస్ వచ్చాయి. ప్రస్తుతం బాహుబలి2 ప్రమోషన్స్ లో ఉన్న ప్రభాస్ వీటిపై రియాక్ట్ అయ్యాడు. అయితే.. ఇక్కడే ప్రభాస్ అసలు సిసలైన కేరక్టర్ ఏంటనే విషయం తెలిసిపోతుంది. హాలీవుడ్ లెవెల్ నుంచి పొగడ్తలు అంటే.. ఎవరైనా గొప్పగా ఫీలవుతారు.

కానీ ప్రభాస్ మాత్రం.. 'అలాంటిది జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు.. రూమర్స్ అయుంటాయ్' అంటూ సింపుల్ గా తేల్చేశాడు యంగ్ రెబల్ స్టార్. ఇంతకంటే సింపల్ అండ్ సూపర్బ్ కేరక్టర్ ఇంకొకళ్లలో చూడగలమా చెప్పండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/