కరణ్ కు నో చెప్పేసిన ప్రభాస్

Thu May 17 2018 12:13:33 GMT+0530 (IST)

బాహుబలి సినిమాతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది. బాహుబలిలో అతడి నటనకు అన్ని భాషల ప్రజలు సాహో అనేశారు. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి జపాన్ టూర్ కు వెళ్లినప్పడు ఆ దేశ ప్రేక్షకులు కూడా హీరో ప్రభాస్ కు.. విలన్ గా నటించిన రానాకు బోలెడు గిఫ్టులిచ్చి పంపించారు. ప్రేక్షకుల్లో ప్రభాస్ కు వచ్చిన పాపులారిటీ.. బాహుబలి కలెక్షన్లు చూసి బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ థ్రిల్లయిపోయాడు. ప్రభాస్ తో డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు.బాహుబలి తరవాత ప్రభాస్ సుజిత్ డైరెక్షన్ లో సాహో చేస్తున్నాడు. ఇది కూడా అతి భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఏడాది పైనే షూటింగ్ చేస్తున్నారు. దీని తరవాత అతడితో సినిమా స్టార్ట్ చేయాలని కరణ్ జోహార్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. సాహో షూటింగ్ కంప్లీట్ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అదీగాక బాహుబలి తరవాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది. కానీ కరణ్ జోహార్ రెమ్యునరేషన్ చాలా తక్కువ ఆఫర్ చేయడంతో ప్రభాస్ సున్నితంగా నో చెప్పేశాడనేది లేటెస్ట్ టాక్.

ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్  కోసం దుబాయ్ వెళ్లాడు. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు ఇక్కడే తీస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం.. మళయాళం.. హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.