Begin typing your search above and press return to search.

ఇంతకీ ప్రభాస్ రియాక్షన్ ఏంటి?

By:  Tupaki Desk   |   18 July 2019 4:12 AM GMT
ఇంతకీ ప్రభాస్ రియాక్షన్ ఏంటి?
X
సాహో విడుదల వాయిదా గురించి అధికారికంగా నిర్మాతలు తప్ప ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇప్పటికీ వీళ్ళ తాలూకు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడం గమనార్హం. మరోవైపు తమ సినిమా విడుదల అంటూ ఆగస్ట్ 15 డేట్ పోస్టర్లతో రణరంగం-ఎవరు ఆల్రెడీ మార్కెటింగ్ మొదలుపెట్టేశాయి. ఇక ఏ చిన్న అనుమానం అక్కర్లేకుండా సాహో పోస్ట్ పోన్ అయినట్టే.

కానీ ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే వాయిదా గురించి ఎప్పుడు ప్రకటిద్దాం అని యూనిట్ అనుకునే లోపే న్యూస్ లీకైపోవడం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా అన్ని చోట్లా ఇది నానా రచ్చ చేయడం చూసి ప్రభాస్ షాక్ తిన్నాడట. ఇన్ని కోట్ల రూపాయలతో సినిమా తీస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచలేకపోయారని తన స్నేహితులతో అన్నట్టు టాక్

అసలు దీనికి కారణం ఎవరో ఆరా తీయమని కూడా చెప్పాడట. ఇది సిబిఐ ఇన్వెస్ టిగేషన్ తరహాలో అంత ఈజీగా తేలే మ్యాటర్ కాదు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దృష్టి పెట్టాల్సింది సాహో కొత్త డేట్ గురించి. ఇప్పటికే ఆగస్ట్ 30 అని కొత్త ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ దాన్ని లాక్ చేసుకున్న నాని గ్యాంగ్ లీడర్ ఖచ్చితమైన సమాచారం కోసం ఎదురు చూస్తోంది. సాహో యూనిట్ కి మాత్రం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉన్న మాట మాత్రం వాస్తవం.

ఒకవేళ ఆగస్ట్ 30 సాధ్యపడదు అనుకుంటే త్వరలో అంటూ మరో అప్ డేట్ ఇచ్చేస్తే ఫాన్స్ లో టెన్షన్ తగ్గుతుంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ దశలోనూ ఇంత ఆలస్యం జరగడం వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ అభిమానులకు కావాల్సింది తమ హీరోను తెరమీద చూసుకోవడం. వీళ్ళ కోసమైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సిచ్యువేషన్ కూల్ అయిపోతుంది