మరో సాహసం కోసం సాహో రెడీ!!

Sat Oct 20 2018 23:00:01 GMT+0530 (IST)

ఇంకో ఆరేడు నెలలు గడిస్తే చాలు బాహుబలి 2 వచ్చి రెండేళ్ళు అవుతుంది .సాహో మొదలుపెట్టింది కూడా అప్పుడే. షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నా మధ్యలో వస్తున్న గ్యాప్స్ అభిమానులను బాగా అసహనానికి గురి చేస్తున్నాయి. అయినా టాలీవుడ్ చరిత్రలోనే కాస్ట్లీ మూవీ అంటున్నారు కాబట్టి ఆ మాత్రం అవుతుంది అని సర్దిచెప్పుకుంటున్నారు. ఆ మధ్య దుబాయ్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్న హైదరాబాద్ లొకేషన్స్ లో బాలన్స్ పూర్తి చేసుకుంటున్న సాహో త్వరలో మరో భారీ ఛేజ్ కోసం రోమానియా వెళ్లబోతోంది. ఇందులో విలన్ గా నటిస్తున్న నీల్ నితీష్ తో పాటు కీలక తారాగణం మొత్తం పాల్గొనబోతోంది. దీనికి హాలీవుడ్ ఫైట్ మాస్టర్ బెన్నీ కేట్స్ నేతృత్యం వహిస్తారు.ఇది కూడా రెండు వారాల దాకా జరగొచ్చని టాక్. ఈ నెల 23న ఓ కీలక అప్ డేట్ ఇస్తానని ప్రభాస్ ప్రకటించిన నేపధ్యంలో అది సాహోదేనా లేక పర్సనాలా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. రోమానియా షెడ్యూల్ అయ్యాక షూటింగ్ మొత్తం ఎప్పుడు పూర్తి కావొచ్చు అనే దాని మీద క్లారిటీ రావొచ్చని తెలిసింది. ఒక వేళ వచ్చే వేసవి అనుకుంటే కనక తేదీ విషయంలో స్పష్టత చాలా అవసరం. మహర్షి ఏప్రిల్ 5 ఫిక్స్ చేసుకుంది. సైరా మే 9న వచ్చే అవకాశాల గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది.

సో సాహో డిసైడ్ అవ్వాలి అంటే ఈ రెండు దృష్టిలో పెట్టుకోవాలి. దేనికవే భారీ ప్రాజెక్ట్స్ కాబట్టి తక్కువ గ్యాప్ లో క్లాష్ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే తొందరపడి సాహో డేట్ ప్రకటించకుండా నిర్మాతలు సంయమనం పాటిస్తున్నారు. అభిమానులు మాత్రం సామాజిక వేదికల మీద యువి సంస్థను అప్ డేట్స్ కోసం నిలదీస్తూనే ఉన్నారు. ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు.