Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 20 టైటిల్ ఇదే

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:25 AM GMT
ప్ర‌భాస్ 20 టైటిల్ ఇదే
X
ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ చిత్రం `సాహో` ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న డార్లింగ్ ప్ర‌భాస్ అటుపై కెరీర్ 20వ సినిమాని ప్రారంభించారు. జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపి కృష్ణ మూవీస్- యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్‌ డేట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అంత‌కంత‌కు హీట్ పెంచుతున్నాయి. ప్ర‌భాస్ న‌టిస్తున్న అద్భుత‌ ప్రేమ క‌థా చిత్ర‌మిది. ఇట‌లీ - యూర‌ప్‌ లో మెజారిటీ భాగం చిత్రీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌హా ప్ర‌ముఖ తారాగ‌ణంపై ఇటలీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

ప్ర‌భాస్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌న్న మాటా వినిపిస్తోంది. బాహుబ‌లి సిరీస్‌ లో అమ‌రేంద్ర బాహుబ‌లి - శివుడు పాత్ర‌ల్లో మెప్పించిన ప్ర‌భాస్ అదే త‌ర‌హా వేరియేష‌న్స్‌ ని ఈ ల‌వ్‌ స్టోరీలోనూ చూపిస్తార‌ని - పీరియాడిక‌ల్ చిత్రం కాబ‌ట్టి ఇందులో ర‌క‌ర‌కాల షేడ్స్ త‌న పాత్ర‌లో క‌నిపిస్తాయ‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. లేటెస్టుగా ప్ర‌భాస్ 20 టైటిల్ కూడా లీకైంది. గ‌త కొంత కాలంగా ఈ సినిమాకి ఓ ఫ్రెంచ్ టైటిల్‌ ని నిర్ణ‌యించార‌ని ప్ర‌చారం సాగింది. `అమూర్‌` అనేది టైటిల్. అమూర్ అంటే ఫ్రెంచిలో ప్రేమ అని అర్థం అని చెప్పుకున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి `జాన్‌` అనే వేరొక‌ టైటిల్‌ ని ఫైన‌ల్ చేశార‌న్న మాటా వినిపిస్తోంది. జాన్ అనేది తాను ల‌వ‌ర్‌ ని పిలుచుకునే పిలుపు. దానినే యువిక్రియేష‌న్స్‌- గోపికృష్ణ సంస్థలు రిజిష్ట‌ర్ చేయించాయ‌ని తెలుస్తోంది. `సాహో` చిత్రంలో బాలీవుడ్ నాయిక శ్ర‌ద్ధాక‌పూర్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ప్ర‌భాస్ 20లో ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే క‌థానాయిక‌. ప్ర‌భాస్ - పూజా రొమాన్స్ ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో ప‌తాక స్థాయిలో ఉంటుంద‌న్న మాటా వినిపిస్తోంది. మొత్తానికి ప్ర‌భాస్‌ కి త‌గ్గ జాన్ పూజా అని భావించ‌వ‌చ్చు. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస కెమెరా వ‌ర్క్ అందిస్తుండ‌గా - శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ చేయ‌నున్నారు. జాతీయ అవార్డు గ్ర‌హీత అమిత్ త్రివేది ఈ ప్రేమ‌క‌థా చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు.