Begin typing your search above and press return to search.

ఆర్టీఏ ఆఫీసులో బాహుబలి ప్రత్యక్షం!

By:  Tupaki Desk   |   30 July 2016 5:49 AM GMT
ఆర్టీఏ ఆఫీసులో బాహుబలి ప్రత్యక్షం!
X
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయి కూడా భారీగా ఫేమస్ అయిన హీరో ప్రభాస్. ప్రభాస్ కెరీర్ బాహుబలి కి ముందు, బాహుబలి తర్వాత అని రెండు భాగాలుగా చుడాలి అంటే అది అతిశయోకి కాదు! ఆ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఈ మధ్య్కాలంలో ఏ హీరోకి రానిస్థాయి గుర్తింపు ప్రభాస్ సొంతమైంది. ఈ స్థాయి ప్రభాస్ శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి ఖైరతాబాద్ లో కనిపించారు. అలా అని ఏ షూటింగ్ కోసమో కాదండోయ్... కొత్తగా కొనుగోలు రేంజ్ రోవర్ రిజిస్ట్రేషన్ కోసం!

ప్రభాస్ రూ.2.82 కోట్ల ఖరీదైన తన కొత్త రేంజ్ రోవర్ కారుతో ఖైరతాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. తన ఈ రేంజ్ రోవర్ రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఉదయం ఖైరతాబద్ ఆర్టీఏ కార్యాలనికి వచ్చిన ప్రభాస్ కాసేపు హల్ చల్ చేశారు. అక్కడున్న అధికారులతో కాసేపు ముచ్చటించిన ప్రభాస్... రూ.5 వేలు ఫీజు చెల్లించి ‘టీఎస్ 09 ఈఎన్ 7567’ నంబర్‌తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

కాగా కొన్నాళ్ల క్రితం ప్రబాస్ రేంజ్ రోవర్ కారును బుక్ చేసుకోగా... ఆ కంపెనీ అనుకోనికారణాలవల్ల ఆ మోడల్ ను ప్రభాస్ కు అనుకున్న సమయంలో అందించలేకపోయింది. దాంతో ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ కొత్త కారును ఇచ్చేవరకూ మరో కారును ఫ్రీగా ఇచ్చి వాడుకోమన్న సంగతి తెలిసిందే.