గెడ్డం మీసం తీసేసిన బాహుబలి

Wed Jun 07 2017 15:56:38 GMT+0530 (IST)

బాహుబలి అంటూ సెన్సేషనల్ హిట్ సాధించాడు ప్రభాస్. నాలుగేళ్లకు పైగా సమయాన్ని కేటాయించినా అందుకు తగ్గ రిజల్ట్ నే అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఏం చేసినా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోతోంది. ప్రభాస్ లుక్ లో మార్పులు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండింగ్ న్యూస్.కొన్ని రోజుల క్రితం స్టైలిస్ట్ హకీమ్ అలీమ్ తన సోషల్ మీడియా పేజ్ లో ప్రభాస్ తో కలిసి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్ కొత్త లుక్ కనిపించింది. డిఫరెంట్ గా కట్ చేసిన గెడ్డం.. హెయిర్ స్టైల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ప్రభాస్ కొత్త సినిమా సాహో లుక్ ఇదే అంటూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి.. ఈ లుక్ ని తెగ షేరింగ్ చేసేసి పండగ చేసేసుకున్నారు. ఇంతలోనే మీసం.. గెడ్డం తీసేసి ప్రభాస్ ఓ రేంజ్ లో షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ ప్రభాస్ క్లీన్ షేవ్ తో కనిపించిన సినిమాలు తక్కువే అని చెప్పాలి.

చక్రంలో గెడ్డం లేకుండా కనిపిస్తాడు. మున్నా మూవీలో లైట్ గా మాత్రమే మీసం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీసం గెడ్డం మొత్తం తీసేసి క్లీన్ షేవ్ తో ఉన్న ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఆన్ లైన్ లో తెగ షేరింగ్ అయిపోతోంది. ప్రభాస్ ఇంతలోనే ఇంత మార్పు చూపించడం మాత్రం అభిమానులకు పెద్ద షాక్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/