Begin typing your search above and press return to search.

ప్రభాస్ అలా ఎలా ఒప్పేసుకుంటాడు?

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:39 AM GMT
ప్రభాస్ అలా ఎలా ఒప్పేసుకుంటాడు?
X
‘బాహుబలి’ లాంటి మెగా ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ ఇమేజ్‌ కు ఏమాత్రం తగ్గని స్థాయిలో ‘సాహో’ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు ప్రభాస్. ఇంకా ప్రభాస్ ఏదో బాలీవుడ్ సినిమా చేస్తాడన్న ప్రచారమూ జరిగింది. ప్రభాస్ కోసం ఇంకా చాలామంది స్టార్ డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో తమిళ డ్యాన్స్ డైరెక్టర్ రాజు సుందరం ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడని.. కథ నచ్చడంతో యంగ్ రెబల్ స్టార్ కూడా ఆ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ నిజంగా ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెబుతాడా అంటే సందేహమే. ఎందుకంటే రాజు సుందరం ఇంతకుముందు తమిళంలో ‘ఏగన్’ అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. అతను ఆ తర్వాత తెలుగులో ‘కిరాక్ పార్టీ’ చేయాల్సింది. కానీ స్క్రిప్టు దశలో సుందరం పని తీరు నచ్చక అతడికి టాటా చెప్పేశారు. ఇక డ్యాన్స్ డైరెక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘రెబల్’ ఫలితమేంటో తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్.. రాజు సుందరంను ఎలా నమ్మి సినిమా చేస్తాడన్నది ప్రశ్నార్థకం. ప్రభాస్‌ కు ఇప్పుడున్న ఇమేజ్‌ ను డీల్ చేయడం రెగ్యులర్ డైరెక్టర్లకే కష్టం. అలాంటిదే రాజు సుందరం నేపథ్యం ప్రకారం చూస్తే ప్రభాస్‌ తో సినిమా చేసి అభిమానుల్ని మెప్పించడం సులువైన విషయం కాదు. కాబట్టి ఈ ప్రాజెక్టు నిజంగా ఓకే అవుతుందా అంటే సందేహమే.