Begin typing your search above and press return to search.

ప్రభాస్.. మరీ సింపుల్ బాసూ!!

By:  Tupaki Desk   |   23 July 2017 9:17 AM GMT
ప్రభాస్.. మరీ సింపుల్ బాసూ!!
X
ప్రభాస్.. రెండేళ్ల క్రితం వరకూ టాలీవుడ్ జనాలకు తప్ప బయటెక్కగా పెద్దగా తెలియని పేరు. కానీ ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ నేమ్ అయిపోయింది. చరిత్ర సృష్టించేసి.. బాలీవుడ్ కి కొత్త భాష్యాలు చెప్పిన బాహుబలి.. ప్రభాస్ కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టేసింది.

అయితే.. ఇంతటి ఇమేజ్ వచ్చాక కూడా.. యంగ్ రెబల్ స్టార్ మాత్రం మునుపటి ప్రభాస్ లాగానే ఉన్నాడు. ఏ కొంచెం కూడా తన బిహేవియర్ లో మార్పు రాకపోవడం ఆశ్చర్యకరం. సహజంగా ఈ స్థాయిలో క్రేజ్ వేరే ఏ హీరోకి ఏర్పడినా.. వాళ్ల ప్రవర్తన మారిపోవడంలో ఆశ్చర్యం ఉండదు. బ్రాండ్ అండార్స్ మెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఓపెనింగ్ లు.. లాంఛింగ్ లు.. ఈవెంట్స్ కు అటెండ్ అయిపోతూ తెగ హంగామా చేసేవాళ్లు. యాటిట్యూడ్ చూపించేసినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ముందు ఎలా సిగ్గరిగా ఉన్నాడో అలాగే కంటిన్యూ అయిపోతున్నాడు.

ప్రభాస్ కు చాలా సిగ్గు అని.. అందుకే బయటెక్కడా ఎక్కువగా కనిపించేందుకు ఇష్టపడడని సన్నిహితులు అంటారు. అయితే.. ఇదంతా ఓ రేంజ్ కు వచ్చే వరకే ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం ఆకాశమంత క్రేజ్ సంపాదించుకుని కూడా ఇప్పటికీ ఇంకా సో సింపుల్ గానే ఉండడం చూస్తే.. హ్యాట్సాఫ్ అనాల్సిందే.