ఆసక్తిని రేకెత్తిస్తున్న 'సాహో' షేడ్స్!!

Mon Oct 22 2018 18:51:35 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం టీజర్ లేదా పోస్టర్ ను విడుదల చేస్తారంటూ చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘సాహో’ చిత్రంలోని హీరో విభిన్న షేడ్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ షేడ్స్ లో మొదటి షేడ్ ను షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 అంటూ రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.‘సాహో’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక కొత్తగా సాహో షేడ్స్ అంటూ పబ్లిసిటీ చేస్తున్న నేపథ్యంలో ఏంటో కొత్తగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షేడ్స్ ఆఫ్ సాహో అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడా లేదంటే పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేయబోతున్నారా అనే విషయంపై చర్చ జరుగుతుంది.

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అంతటి భారీ సక్సెస్ కోసం ప్రభాస్ మరోసారి కష్టపడుతున్నాడు. ప్రభాస్ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రన్ రాజా రన్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సుజీత్ ఈ చిత్రంను ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతున్న సాహో షేడ్స్ ఏంటీ అనే విషయంపై రేపు ఉదయం 11 గంటలకు క్లారిటీ రాబోతుంది.