Begin typing your search above and press return to search.

సొంత సినిమాకి ప్రచారం చేస్తున్న బాహుబలి!

By:  Tupaki Desk   |   24 Sep 2017 6:25 AM GMT
సొంత సినిమాకి ప్రచారం చేస్తున్న బాహుబలి!
X
టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాలా ఫాస్ట్ గా పెద్ద బ్యానర్ అనిపించుకుంది యువి క్రియేషన్స్. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ అన్నదమ్ములదనే విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ తో మిర్చి తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యానర్ ద్వారా ఏ సినిమా వచ్చినా దానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తుంటాడు ప్రభాస్. అందుకు నిదర్శనం ఈ బ్యానర్ ఇంతవరుకు నిర్మించిన సినిమాలకు సంబంధించన ప్రమోషన్స్ లో యాక్టివ్ పాల్గొంటూ వస్తున్న ప్రభాస్ ఈసారి కూడా తన పంధా మారలేదు. వరుసగా రన్ రాజా రన్ - జిల్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమా ప్రమోన్ ఫంక్షన్స్ ఛీప్ గెస్ట్ గా హాజరైన ప్రభాస్ ఈసారి యువి నుంచి రాబోతున్న మహానుభావుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడు.

సెప్టెంబర్ 24న హైదరాబాద్ సంధ్య కన్వేషన్ సెంటర్ లో ఈ ప్రమోషన్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ప్రోగ్రామ్ కి ప్రభాస్ ఛీప్ గెస్ట్ హాజరవుతున్నాడని చిత్ర వర్గాలు ప్రకటించాయి. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ - మెహరిన్ జంటగా తెరకెక్కిన మహానుభావుడు విజయదశమి కానుకగా సెప్టెంబర్ 29న విడుదల అవుతోంది. ఈ సినిమాతో పాటు యువి బ్యానర్ పై ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాహో - అనుష్క కీలక పాత్ర పోషిస్తున్న భాగమతి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరి ముందుగా మహానుభావుడు ప్రమోషన్స్ కి ప్రభాస్ ఎంతవరుకు హెల్ప్ అవుతాడో చూడాలి!