Begin typing your search above and press return to search.

పెళ్లి నా వ్య‌క్తిగ‌త వ్య‌వహారం:ప‌్రభాస్

By:  Tupaki Desk   |   18 Jun 2018 1:35 PM GMT
పెళ్లి నా వ్య‌క్తిగ‌త వ్య‌వహారం:ప‌్రభాస్
X
బాహుబ‌లిలో అమ‌రేంద్ర బాహుబ‌లి - దేవ‌సేనల జంట మ‌ధ్య ప్రేమ క‌థ సినీ ప్రేమికుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆన్ స్క్రీన్ పై అంద‌రినీ అల‌రించిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒక్క‌టైతే బాగుండ‌ని అనుకోని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే, ప్ర‌భాస్, అనుష్క‌లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గ‌త మూడేళ్లుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో - సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరిద్ద‌రూ జంట‌యితే బాగుంటుందంటూ....కొంత‌మంది నెటిజ‌న్లు ప్ర‌భాస్ - అనుష్క‌ల‌కు స‌ల‌హాలు కూడా ఇచ్చాశారు. అయితే, తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మేన‌ని - అంత‌కు మించి త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని ఇప్పటికే చాలాసార్లు ప్ర‌భాస్ - అనుష్క‌లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా, మ‌రోసారి వీరిద్ద‌రూ ఆ విష‌యంపై మ‌రింత స్ప‌ష్ట‌త‌నిచ్చిన‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. తాము పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని, తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని వారిద్ద‌రూ క్లారిటీ ఇచ్చారని ఆ క‌థ‌నం సారాంశం.

కొద్ది రోజుల క్రితం అనుష్క హిమాలయాలను సంద‌ర్శించింది. అదీగాక‌, భాగమతి తర్వాత ఒక్క సినిమాలోనే న‌టిస్తోంది. మ‌రే సినిమాలు ఒప్పుకోలేదు. దీంతో, త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోంద‌ని, పెళ్లి గురించే పుణ్య‌క్షేత్రాల‌కు వెళుతోంద‌ని పుకార్లు వ‌చ్చాయి. అయితే, ఆ పుకార్ల‌ను అనుష్క ఖండించింది. మ‌రోవైపు, తన పెళ్లి వార్తలపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడ‌ని ఓ ఆంగ్ల వెబ్‌ సైట్ ప్రచురించింది. పెళ్లి అనేది త‌న వ్యక్తిగత వ్య‌వ‌హార‌మ‌ని, ఒక‌వేళ త‌న‌కు పెళ్లి కుదిరితే వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన‌ట్లు క‌థ‌నం ప్ర‌చురించింది. మీడియాకు, త‌న‌ ఫ్యాన్స్ కు ఆ వార్త‌ను తప్పకుండా తెలియజేస్తాన‌ని ప్ర‌భాస్ అన్న‌ట్లు క‌థ‌నంలో వెల్ల‌డించింది. అయితే, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ‌ - విరాట్ కోహ్లీల జంట కూడా పెళ్లికి ముందు ఇలా పుకార్ల‌ను కొట్టిప‌డేసిన త‌ర్వాత ....పెళ్లి చేసుకున్నారు. అదే త‌ర‌హాలో మీడియా దృష్టిలో ప‌డ‌కుండా ఉండేందుకే అనుష్క‌ - ప్ర‌భాస్ లు ఈ విధంగా ప్ర‌క‌ట‌న‌లిస్తున్నార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా - వారిద్దరి పెళ్లి విష‌యంపై క్లారిటీ రావాలంటే మ‌రి కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.