సాహో గురించి ప్రభాస్ చెప్పేశాడు

Tue Apr 17 2018 11:26:49 GMT+0530 (IST)

ప్రభాస్ - సాహో సినిమాను మొదలుపెట్టి చాలా రోజులు కావొస్తోంది. కానీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం అఫీషియల్ గా రావడం లేదు. వాళ్లు వీళ్లు చెప్పిన రూమర్స్ గురించి చర్చలే తప్ప సినిమా యూనిట్ అధికారికంగా ఒక్క పాయింట్ కూడా బయటపెట్టడం లేదు. అసలే బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ చాలా పెరిగిపోయింది. బాహుబలి రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ సాహో ఫస్ట్ లుక్ టీజర్ తప్పితే సినిమా కథ గురించి పాత్రల గురించి ఎలాంటి న్యూస్ పెద్దగా రాలేదు.అయితే ఆడియెన్స్ మరచిపోతున్నారు అనుకున్నాడో ఏమో గాని ప్రభాస్ రీసెంట్ గా మాత్రం మంచి క్లారిటీ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని బయటపెట్టాడు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సాహో సినిమాలో గ్రాఫిక్స్ కీలకమని తెలియజేశాడు. అంతే కాకుండా సినిమాలో పాత్రలు చాలా హైలెట్ అవుతాయని. కథ ఇంకా కీలకమని చెప్పారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా సినిమాలో విజువల్ వండర్ చూస్తారు అని ఒక నవల తరహాలో మూవీ సాగుతుందని తెలిపారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను యూవీ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా విలన్ పాత్రల్లో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముకేష్ అలాగే జాకీష్రాఫ్ - చుంకీ పాండే కనిపించనున్నారు. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కూడా మరో ముఖ్యమైన రోల్ లో నటించనున్నారు. వచ్చే ఏడాది సాహో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.