Begin typing your search above and press return to search.

అక్టోబర్ 5.. ప్రభాస్ ఇచ్చే గిఫ్టేంటో??

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:34 AM GMT
అక్టోబర్ 5.. ప్రభాస్ ఇచ్చే గిఫ్టేంటో??
X
వచ్చే అక్టోబర్ 5న.. బాహుబలిని ఇష్టపడే అందరికీ.. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు.. ఒక భారీ గిఫ్టును ఇవ్వడానికి దర్శకుడు రాజమౌళి డిసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ గిఫ్టు ఏంటనేదే ఇప్పడు ఎవ్వరికీ తెలియని సస్పెన్సు. మరో ఐదు రోజుల్లో ఈ గిఫ్టు ఏంటనేది తెలిసిపోతుంది కాని.. ఇప్పుడు అసలు ఆ గిఫ్టు ఏంటనేదే అందరి మదిలోనూ మెదులుతున్న ఆతృతానంద క్వశ్చన్.

ఇంతకీ ఏం గిఫ్టు ఇస్తున్నారు? ఏదన్నా ఆస్కార్ అవార్డు కాని లేదంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు తాలూకు నామినేషన్ ఏదైనా దక్కిందా? అబ్బే కాదట. పోనివ్ ప్రభాస్ పెళ్లి కుదిరిందా? ఎప్పటినుండో సంబంధాలు చూస్తున్నాం అంటున్నారు కాబట్టి.. ఇప్పుడు ఏదైనా సంబంధం సెట్టయ్యింది అంటారా? అబ్బే అది కూడా కాదట. ఎలాగో ఫస్ట్ లుక్ 22న.. టీజర్లు ట్రైలర్లు జనవరిలో అని చెప్పారు కాబట్టి.. అవి కానే కాదు. అలాంటప్పుడు 5న ఏం గిఫ్టు ఇస్తారండీ?

ఇదే విషయాన్ని రాజమౌళిని అడిగితే.. ''మేం ఈ గిఫ్టు గురించి విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగ్ గా ఫీలయ్యామో.. మీరు కూడా ఈ గిఫ్టు గురించి తెలిసినప్పుడు అదే కిక్ ఫీలవుతారు. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్ మిస్సయిపోతుంది. కాబట్టి వెయిట్ చేయండి. అక్టోబర్ 5న పండగే'' అంటూ సెలవిచ్చాడు. కాబట్టి అందరూ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/