Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌ ని వెంటాడుతున్న లేడీ బిల్లా

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:55 AM GMT
ప్ర‌భాస్‌ ని వెంటాడుతున్న లేడీ బిల్లా
X
సామాజిక మాధ్య‌మాల్లో స్టార్ల‌కు ఉన్న‌ పిచ్చి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. అందునా డార్లింగ్ ప్ర‌భాస్‌ కి ఆ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ‌. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. అందులో కొంద‌రు పిచ్చి పీక్స్‌ కి చేరిన ఫ్యాన్సు సంగ‌తి స‌రే స‌రి. వీళ్ల ఆగ‌డాల‌కు హ‌ద్దు అన్న‌దే ఉండ‌దు.

అందుకు సాక్ష్య‌మే ఈ ఫోటోలు. ఇటీవ‌లే ఇట‌లీ లేక్ కోమో లో దీప్ - వీర్ వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. కేవ‌లం 40 మంది అతిధుల స‌మ‌క్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. కొంక‌ణి- సింధీ సాంప్ర‌దాయాల ప్ర‌కారం ఈ బాలీవుడ్ జోడీ రెండు సార్లు పెళ్లాడుకున్నారు. ఆ ఫోటోల్ని దీపిక‌ - ర‌ణ‌వీర్ స్వ‌యంగా అభిమానుల కోసం సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌లైంది.

ప్ర‌స్తుతం ఆ ఫోటోల‌తో పాటుగా డార్లింగ్ ప్ర‌భాస్ - అనుష్క శెట్టి ఫోటోల్ని జోడించి `వాళ్ల‌లానే వీళ్లు పెళ్లాడాలి` అంటూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్‌. ర‌ణ‌వీర్ - దీపిక - కోహ్లీ - అనుష్క శ‌ర్మ‌ - ప్ర‌భాస్- అనుష్క జంట‌ల ఫోటోల్ని ఒకే ఫ్రేమ్‌ లోకి తెచ్చి - వైర‌ల్ గా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేస్తుండ‌డం వేడెక్కిస్తోంది. ఓవైపు డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస షూటింగుల‌తో బిజీ. మ‌రోవైపు అనుష్క వెయిట్ రిడ‌క్ష‌న్ ట్రీట్‌ మెంట్‌ లో బిజీ గా ఉంద‌ని ప్ర‌చార‌మవుతోంది. అనుష్క తొంద‌ర్లోనే పెళ్లికి రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం న‌డుమ త‌దుప‌రి ప్రాజెక్టు ఓకే అయ్యింద‌ని తెలిసింది. అనుష్క - మాధ‌వ‌న్ జంట‌గా కోన వెంక‌ట్ నిర్మించే సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ ప‌రిణామాల మ‌ధ్య మ‌రోసారి ప్ర‌భాస్‌ తో అనుష్క పెళ్లి అంటూ అభిమానులు అత్యుత్సాహం చూపించ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. అస‌లింత‌కీ సామాజిక మాధ్య‌మాల్లో లేడీ బిల్లా పేరుతో ప్ర‌భాస్‌ ని వెంబ‌డిస్తున్న ఆ పిల్ల ఎవ‌రు? అంటూ మ‌రో చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. అస‌లింత‌కీ ప్ర‌భాస్‌ ని వెంటాడుతున్న లేడీ బిల్లా ఎవ‌రై ఉంటారు?