యూవీ పై మండిపడుతున్న అభిమానులు

Fri Oct 19 2018 16:08:19 GMT+0530 (IST)

ప్రభాస్ అభిమానులు 'సాహో' నిర్మాతల పైన చాలా కోపంగా ఉన్నారట. సినిమా మొదలు పెట్టి ఇప్పటికి ఏడాది దాటినా రిలీజ్ కాకపోవడం ఒక కారణం అయితే.. కనీసం 'సాహో' కు సంబంధించిన అప్ డేట్స్ పంచుకోకపోవడం మరో కారణం.  'బాహుబలి-2' రిలీజుకు ముందు విడుదల చేసిన 'సాహో' టీజర్ తప్ప ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా లేదు.  లీకయిన ఫోటోలు తప్ప అసలు సినిమా ఎంత భాగం షూటింగ్ అయిందన్న విషయంలో కూడా అభిమానులకు క్లారిటీ ఇవ్వడం లేదు.కొద్ది రోజుల క్రితం ఓ ప్రభాస్ అభిమాని యూవీ క్రియేషన్స్ వారిని అప్డేట్ ల గురించి అడిగి అడిగి విసిగి పోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా ఒక ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులు కొందరు యువీ క్రియేషన్స్ వారి ఆఫీసుకు వెళ్లి అక్కడ అప్డేట్స్ విషయంలో గొడవ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది.  ఇక సోషల్ మీడియా లో '#వుయ్ వాంట్ సాహో అప్డేట్' అంటూ హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.  అసలు ఏడాది పాటు ఒక్క అప్డేట్ కూడా లేకుండా ఉండడం ఏంటని అభిమానులు ప్రశిస్తున్నారు.

ఈ  హంగామా జరగడం అంతా ప్రభాస్ దృష్టికి వచ్చిందని.. అందుకే తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అక్టోబర్ 23 న తన పుట్టినరోజునాడు అభిమానులకు ఒక  స్వీట్ న్యూస్ ఇస్తానని ప్రకటించాడట.  ప్రభాస్ పెట్టిన మెసేజ్ ను కొంతమంది 'పెళ్ళి వార్త' అంటున్నారు కానీ అలాంటిదేమి కాదని సాహో కొత్త టీజర్ లేదా మరో సినిమా ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేస్తారని సమాచారం.