Begin typing your search above and press return to search.

బాహుబలి బర్త్ డే వేడుకల్లో విషాదం!

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:47 AM GMT
బాహుబలి బర్త్ డే వేడుకల్లో విషాదం!
X
తమ అభిమాన నటుడి సినిమా విడుదల అవుతుంటే అక్కడ వారి వారి అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ థియేటర్ ని ముస్తాబులు చేసి, పెళ్లి పందిరిలా, పెళ్లింటిలా తయారుచేస్తారు. థియేటర్ల ప్రాంగణాల్లో రంగురంగుల జెండాలు, థియేటర్లకు పూల తోరణాలు కడతారు. ఇక వారి అభిమాన హీరో బర్త్ డే అయితే... ఇక చెప్పేదేముంది. వారి పరిధిమేరకు కనుచూపుమేరల్లో వారు చేసే హడావిడి దుమ్ములేపేస్తుందంతే! తమ హీరో పేరుచెప్పి అన్నదానాలు - వస్త్రదానాలు - రక్తదానాలు ఇలా చెప్పుకుంటూపోతే ఆ రోజు వారి వారి పుట్టినరోజులకంటే కొన్ని వందల రెట్లు ఘనంగా తమ హీరో బర్త్ డే వేడుకలు జరుపుతారు.

ఇదే క్రమంలో "బాహుబలి" తో తమ అభిమాననటుడు ప్రపంచస్థాయి గుర్తింపును పొందాడు, "బాహుబలి-2" రూపంలో మరోసారి ప్రపంచాన్ని ఒక కుదుపుకుదపడానికి వస్తున్నాడు అన్న సంబరాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ బర్త్ డే వేడుకని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. అదే తరహాలో నిజామాబాద్‌ జిల్లాలో కూడా ప్రభాస్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం (అక్టోబర్‌ 23న) బాహుబలి - యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా మొదలవుతోన్న వేడుకల్లో అభిమానుల్లో ఒకడైన ప్రశాంత్‌ (19) అనే యవకుడు ప్రమాదవసాత్తు మృతిచెందాడు. తన అభిమాన హీరో ఫ్లెక్సీని కడుతుండగా ఆకస్మాత్తుగా విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ తగిలింది. దీంతో ఆ అభిమాని ప్రశాంత్‌ అక్కడిక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/