Begin typing your search above and press return to search.

బాహుబలి ఎంట్రీ.. క్యా సీన్ హై

By:  Tupaki Desk   |   27 March 2017 5:16 AM GMT
బాహుబలి ఎంట్రీ.. క్యా సీన్ హై
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా ఎలా ఉండబోతోందో.. ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక శాంపిల్ వదిలింది రాజమౌళి అండ్ టీం. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ ఆడియో వేడుకలోనూ హీరోను ప్రెజెంట్ చేయని రీతిలో ఈ ఫంక్షన్లో ప్రభాస్ ను వేదిక మీదికి తీసుకొచ్చారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరి గురించి ఒక ఏవీ వేస్తూ వారిని వేదిక మీదికి తీసుకొచ్చిన ‘బాహుబలి’ టీం.. భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటిని వేదిక మీదికి రప్పించే ముందు కొంచెం హడావుడి పెంచింది. స్పెషల్ బ్యాగ్రౌండ్ స్కోర్.. కళాకారుల ప్రత్యేక నృత్యంతో అతడిని వేదిక మీదికి తీసుకొచ్చారు. ఇదే వావ్ అనిపిస్తే ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది.

స్టేజ్ పై నుంచి క్రేన్ సాయంతో దారం కట్టి ప్రభాస్ ను కిందికి దించారు. చుట్టూ బాణసంచా వెలుగుల మధ్య.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ మధ్య ప్రభాస్ ఎంట్రీ చూసేవాళ్ల కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఈ వేడుక మొత్తంలో విజువల్ గా ఇదే హైలైట్ అనడంలో సందేహం లేదు. కిందికి దిగాక మైక్ అందుకున్న ప్రభాస్.. సినిమాలో ఇలాంటి విన్యాసాలు చేయడం మామూలే.. ఆడియో వేడుకలోనూ ఇలాంటి చేయించారేంటి అని నవ్వేశాడు. ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ గురించి సోషల్ మీడియా పెద్ద చర్చే నడిచింది. ఈ వీడియో వైరల్ అయింది. ఇక వేడుక ముగిసిన అనంతరం ప్రభాస్-అనుష్క కలిసి బాణాలు పట్టుకుని ఉన్న చిత్రంతో ఒక చక్రాన్ని నిలబెట్టి.. దాని చుట్టూ బాణసంచా వెలుగులు వచ్చేలా చేయడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/