Begin typing your search above and press return to search.

క‌బీర్ సింగ్ కి ప్ర‌భాస్ కాంప్లిమెంట్

By:  Tupaki Desk   |   13 April 2019 4:56 PM GMT
క‌బీర్ సింగ్ కి ప్ర‌భాస్ కాంప్లిమెంట్
X
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ `క‌బీర్ సింగ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్ రెడ్డి`కి రీమేక్ ఇది. గుబురు గ‌డ్డం.. చెదిరిన త‌ల‌క‌ట్టు.. ర‌గ్గ్ డ్ గా.. యారొగెంట్ అప్పియ‌రెన్స్ తో షాహిద్ పోస్ట‌ర్ల‌లో మైమ‌రిపిస్తున్నాడు. టాలీవుడ్ అర్జున్ రెడ్డి కంటే ఇంకాస్త ర‌ఫ్ & ఠ‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు షాహిద్. నిన్న రిలీజైన `క‌బీర్ సింగ్` ట్రైల‌ర్ అంత‌ర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ ట్రైల‌ర్ ని సందీప్ రెడ్డి వంగ యాజిటీజ్ తెలుగు అర్జున్ రెడ్డి ట్రైల‌ర్ లానే డిటోగా దించేశాడ‌ని మాట్లాడుకున్నారు. షాహిద్ క‌పూర్ పెర్ఫామెన్స్ దేవ‌ర‌కొండ త‌ర‌హాలోనే ఎమోష‌న‌ల్ గా సాగింది. షాహిద్ మేకోవ‌ర్ ఇన్వాల్వ్ మెంట్ ఫెంటాస్టిక్ అన్న టాక్ వినిపించింది.

ఈ ట్రైల‌ర్ ని డార్లింగ్ ప్ర‌భాస్ చూశార‌ట‌. చూడ‌ట‌మే కాదు షాహిద్ కి ఫోన్ చేసి ఒరిజిన‌ల్ అర్జున్ రెడ్డి ట్రైల‌ర్ కంటే బావుంద‌ని ప్ర‌శంసించార‌ట‌. షాహిద్ లుక్ గురించి.. పెర్ఫామెన్సెస్ గురించి కాంప్లిమెంట్లు ఇచ్చాడ‌ట‌. ఆ సంగ‌తిని ముంబై హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కిమ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హైద‌రాబాద్ లో సాహో షూటింగులో బిజీగా ఉన్నారు. సెట్స్ లోనే ఆయ‌న క‌బీర్ సింగ్ ట్రైల‌ర్ చూశారు. ట్రైలర్ చూడ‌గానే పిచ్చిగా న‌చ్చేసింది. ఇంప్రెస్ అయిపోయి వెంట‌నే షాహిద్ తో మాట్లాడ‌తాన‌ని అన్నార‌ట‌. ఆకిమ్ స్వ‌యంగా షాహిద్ కి ఫోన్ లైన్ క‌లిపి ప్ర‌భాస్ తో మాట్లాడించారు. ఫోన్ అందుకున్న ప్ర‌భాస్ ఏకంగా ఏడు నిమిషాల సేపు షాహిద్ తో అదే ప‌నిగా క‌బీర్ సింగ్ ట్రైల‌ర్ గురించి ముచ్చ‌టించారు. ఆ ముచ్చ‌ట్ల‌లో ఒక‌టే కాంప్లిమెంట్ల వ‌ర్షం కురిపించార‌ని ఆలిమ్ తెలిపాడు.

మొత్తానికి డార్లింగ్ ప్ర‌భాస్ బాలీవుడ్ లో స్నేహాల్ని అంత‌కంత‌కు పెంచుకుంటున్నారు. అక్క‌డ స్టార్ హీరోల‌తోనూ సాన్నిహిత్యం కొన‌సాగిస్తూ సిస‌లైన డార్లింగ్ అని నిరూపిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న `సాహో` మేకింగ్ వీడియోలు చూసి బాలీవుడ్ స్టార్లు సైతం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. బాహుబలి రేంజులో ప్ర‌భాస్ మ‌రో బంప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని ఉత్త‌రాది మార్కెట్లోనూ మార్మోగుతోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ యాక్ష‌న్ మూవీలో న‌టిస్తున్న స్టార్ గా ప్ర‌భాస్ పేరు స్పీడ్ గానే వైర‌ల్ అయ్యింది. `సాహో` ఆగ‌స్టు 15న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.