Begin typing your search above and press return to search.

అవంతిక సినిమాలో బాహుబలి కేమియో?

By:  Tupaki Desk   |   27 Jun 2017 6:02 AM GMT
అవంతిక సినిమాలో బాహుబలి కేమియో?
X
ఈ మధ్య బాలీవుడ్ లో ప్రభాస్ గురించి తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా యంగ్ రెబల్ స్టార్ కు ఇమేజ్ వచ్చేసింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ గురించి ఏదో ఒక అప్డేట్ చెప్పేందుకు.. ఛానళ్లు-వెబ్ సైట్స్ కూడా తెగ ఉత్సాహం చూపించేస్తున్నాయి. లేటెస్ట్ గా ప్రభాస్ పై పుట్టిన న్యూస్ ఏంటంటే.. ఓ బాలీవుడ్ మూవీలో ప్రభాస్ కేమియో చేస్తున్నాడట.

ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడంటే.. కచ్చితంగా ఆ మూవీ క్రేజ్.. హైప్ పెరిగిపోతాయి. ఇప్పుడు ప్రభుదేవా- తమన్నాలు నటిస్తున్న ఖామోషీ చిత్రంలో ప్రభాస్ కేమియో చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభాస్- తమన్నాలు మంచి ఫ్రెండ్స్ కావడం.. బాహుబలి సిరీస్ లో కలిసి నటించడం వంటి రిలేషన్స్ కారణంగా.. ఒక కేమియో కోసం అడగ్గానే ప్రభాస్ ఒప్పుకున్నాడని.. స్టోరీకి కీలకమైన మలుపు తిప్పే దగ్గర ఈ రోల్ వస్తుందని చెప్పేస్తున్నారు.

చక్రి తోలేటి దర్శకత్వంలో వషు భగ్నాని నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం.. కోలీవుడ్ మూవీ కొలైయుథిర్ కాలంకు హిందీ రీమేక్. తమిళ్ లో నయన్ రోల్ ను.. హిందీలో తమన్నా చేస్తోంది. అయితే.. ప్రభాస్ కేమియోపై మాత్రం దర్శక నిర్మాతలు నోరు విప్పడం లేదు. సినిమా రిలీజ్ అయ్యాకే థ్రిల్స్ అన్నీ తెలుసుకోవాలని చెప్పేస్తున్నారు. గతంలో యాక్షన్ జాక్సన్ సినిమాలో కూడా ప్రభాస్ ఇదే విధంగా ఒక కేమియో చేశాడు. కాని అప్పట్లో మనోడి కేమియో అంతగా హైలైట్ కాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/