Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా.. ఆ ఒక్కటి తప్ప

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:55 AM GMT
ప్రభాస్ సినిమా.. ఆ ఒక్కటి తప్ప
X
ముహూర్తం దగ్గర పడుతోంది. మూడున్నరేళ్లుగా ‘బాహుబలి’కి అంకితమైపోయి ఉన్న ప్రభాస్.. త్వరలోనే ఆ సినిమా నుంచి బయటికి రాబోతున్నాడు. ఇంకో రెండు నెలల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’కు సంబంధించి ప్రభాస్ తన పని పూర్తి చేస్తాడని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లోనే సుజీత్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు ప్రభాస్.

ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరందుకుంది. స్క్రిప్టు విషయంలో అంతా పక్కాగా రెడీ అయింది. టెక్నీషియన్స్.. నటీనటుల ఎంపిక కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేసింది. ఇక తేలాల్సింది ఒక్క హీరోయిన్ సంగతే. ఈ విషయంలో చాలా కాలం నుంచి తర్జన భర్జనలు నడుస్తున్నాయి. హీరోయిన్ విషయంలో చాలా పేర్లు పరిశీలించారు. ఓ దశలో అమీ జాక్సన్‌ ను ఓకే చేశారు. కానీ ఆమె ప్రభాస్ పక్కన సూటవదేమో అని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారట. పైగా బాలీవుడ్లో మంచి పేరున్న స్టార్ హీరోయిన్నే ప్రభాస్‌ కు జోడీగా ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

ప్రభాస్‌ హీరోగా సినిమా చేయడానికి సుజీత్ కథ రాసినపుడు అది చిన్న ప్రాజెక్టే. కానీ ఈ లోపు బాహుబలి విడుదలై ప్రభాస్ రేంజే పెరిగిపోయింది. ఇప్పుడు అతడి క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. అందుకే ఈ సినిమాను భారీ స్థాయిలో చేయబోతున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్ అంటున్నారు. తెలుగుతో పాటు హిందీ - తమిళ భాషల్లోనూ నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ విషయంలో రాజీ పడకూడదని కొంచెం పారితోషకం ఎక్కువైనా పర్వాలేదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని తీసుకుందామని చూస్తున్నారు. అలాగైతేనే హిందీలోనూ ఈ సినిమాను పెద్ద స్థాయిలో రిలీజ్ చేయొచ్చన్నది ప్లాన్. అన్నీ సరిగ్గా కుదిరితే హిందీలో ఓ పాతిక కోట్లకైనా సినిమాను అమ్మేద్దామన్నది ‘యువి క్రియేషన్స్’ ఆలోచన. మరి ప్రభాస్‌ కు జోడీ అయ్యే స్టార్ హీరోయిన్ ఎవరో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/