Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య! వెయిటింగ్ ఫ‌లించి..!

By:  Tupaki Desk   |   3 Sep 2018 4:07 AM GMT
హ‌మ్మ‌య్య! వెయిటింగ్ ఫ‌లించి..!
X
హ‌మ్మ‌య్య‌! మూడేళ్ల నిరీక్ష‌ణ ఫ‌లిస్తోంది. యువ‌ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ముఖంలో ఆనందం తాండ‌వించే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లు త‌న‌ని వెయిట్ చేయించిన ప్ర‌భాస్ ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకోమ‌ని చెప్పేశాడ‌ట‌. సెప్టెంబ‌ర్ 6న ప్ర‌భాస్ 20వ సినిమాకి ఠెంకాయ కొట్టేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు జిల్ రాధాకృష్ణ త‌న సినిమా ప్రారంభోత్స‌వం కోసం ప్రిప‌రేష‌న్‌ లో ఉన్నార‌ని చెబుతున్నారు.

2015లో `జిల్` సినిమా రిలీజైతే - ఆ త‌ర్వాత క‌థ ఓకే చేసిన ప్ర‌భాస్ మూడేళ్ల పాటు వెయిట్ చేయించ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితేనేం ఈ వెయిటింగ్ ఫ‌లించి `సాహో` హీరోనే డైరెక్ట్ చేసే అవ‌కాశం ఛేజిక్కించుకున్నాడన్న చ‌ర్చా సాగుతోంది. `సాహో` ప్ర‌భాస్ కెరీర్ 19వ సినిమా. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి సాహో లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. అందుకోసం రాజీలేని షెడ్యూల్స్‌ తో త‌ల‌మున‌క‌లుగా ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే రాధాకృష్ణ ఇన్నాళ్లు వేచి చూడాల్సొచ్చింది. మొత్తానికి లాంచ్‌ చేసేస్తున్నారు కాబ‌ట్టి, త‌దుప‌రి సాహో చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ విష‌య‌మై చిత్ర‌యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్‌ తో క‌లిసి గోపి కృష్ణ మూవీస్ ప‌తాకంపై కృష్ణంరాజు స్వ‌యంగా నిర్మిస్తున్నారు. యూర‌ప్‌ లోని అరుదైన లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌. ఇదో చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తెలుస్తోంది.