Begin typing your search above and press return to search.

మహేంద్ర బాహుబలితో మహీంద్రా యాడ్

By:  Tupaki Desk   |   4 Sep 2015 11:00 AM GMT
మహేంద్ర బాహుబలితో మహీంద్రా యాడ్
X
నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదిస్తున్న తెలుగు స్టార్ల సంఖ్య పెరిగిపోతోంది. సినిమాల్లోనే కాదు... నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడంలోనూ.. బాలీవుడ్ కి పోటీ ఇచ్చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. మహేష్ బాబు ఇప్పటికే ఈ రేస్ లో చాలా ముందుండగా... బాహుబలి తర్వాత రాణా స్పీడ్ కూడా బాగానే పెరిగింది. ఇప్పుడు మన బాహుబలికి కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి తమ కంపెనీ యాడ్ లో నటించేందుకు ఒప్పించారు మహీంద్రా వాళ్లు.

మహీంద్రా సంస్థ కొత్త వెహికల్ రేంజ్ టీయూవీ 300 కోసం ప్రభాస్ ని... ప్రచారకర్తగా తీసుకున్నారు. అది కూడా స్టేట్ వైడ్ గా కాదు... నేషనల్ వైడ్ గా మనోడే ఈ బ్రాండ్ కి అంబాసిడర్. ఇఫ్పటికే ఈ యాడ్ షూటింగ్ మొదలైపోయింది కూడా. దీంట్లో కూడా ప్రభాస్ స్పెషాలిటీ చూపించబోతున్నారు యాడ్ మేకర్స్. యాడ్ అంటే.. అదేదో కార్లో కూర్చుని ఓ చెయ్యి ఊపడం, బయట నుంచుని కారుపై కాలు పెట్టి ఫోజివ్వడంతో సరిపెట్టడం లేదు. బాహుబలి లాంటోడిని తెచ్చుకున్నారు కదా.. అందుకే పర్వేజ్ షేఖ్ అనే యాక్షన్ డైరెక్టర్ ని తెచ్చి.. అద్భుతమైన షాట్స్ విజువలైజ్ చేస్తున్నారట.

ఇప్పటికే రిలీజైన మేకింగ్ షాట్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక పూర్తి యాడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది. యాడ్ చూస్తే.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా వచ్చాయట ఈ షాట్స్. యాడ్ షూటింగ్ కోసం ఖర్చు కూడా బాగానే పెట్టారని తెలుస్తోంది. కరెక్టే ప్రభాస్ ని నమ్మి ఎంత బడ్జెట్ అయినా పెట్టేయచ్చు.. ఈ విషయం బాహుబలి ప్రూవ్ చేసింది కదా.