2019 ఎండ్ లోనే ప్రభాస్ 20

Sun Dec 16 2018 16:04:40 GMT+0530 (IST)

డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే వేరొక స్టార్ హీరో తనని ఇంచ్ కూడా టచ్ చేయలేరేమో! అన్నంతగా ఉంది. బాహుబలి చిత్రంలో నటించే ముందు ప్రభాస్ సన్నివేశమేంటో తెలిసిందే. మెయింటెనెన్స్‌కే ఎంతో ఇబ్బందిగా ఉండేదని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చాడు డార్లింగ్. ఆ తర్వాత సన్నివేశమేంటో చూస్తున్నదే. డార్లింగ్ ఇప్పుడు చుక్కల్లో చంద్రుడు. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీ స్టార్‌గా వెలిగిపోతున్నాడు.ఇప్పటికిప్పుడు హాలీవుడ్ రేంజు భారీయాక్షన్ సినిమా చేస్తున్నాడు. సేమ్ టైమ్ వేరొక రొమాంటిక్ లవ్‌స్టోరిలో నటిస్తూ వైవిధ్యానికి కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ స్కైను టచ్ చేసి అంతకుమించి చూపిస్తాడనే అభిమానుల్లో అంచనాలేర్పడ్డాయి. సుజీత్ - సాహో చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెబుతున్నా భారీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వల్ల ఆగస్టు వరకూ వెళుతుందని చెబుతున్నారు.

మరో వైపు ప్రభాస్ 20 గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది? అన్నదానికి తాజాగా దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీనిచ్చారు. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాది పడుతుందన్నది అతడు చెబుతున్న మాట. 2019 చివరినాటికే రిలీజ్ ఉంటుందని క్లారిటీనిచ్చాడు. అంటే సుదీర్ఘంగా ఇంకో 12 నెలల పాటు ప్రభాస్ 20 కోసం అభిమానులు వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆగస్టులో సాహో రిలీజైతే అటుపై డిసెంబర్ లేదా జనవరి 2020లో ప్రభాస్ 20 (జాన్- టైటిల్ వినిపిస్తోంది) రిలీజవుతుందన్నమాట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూరప్ పరిసరాల్లో సాగే అద్భుతమైన ప్రేమకథా చిత్రమిదని ప్రచారం సాగుతోంది. ఇందులో చేతి రేఖలు చూసే హస్త సాముద్రిక నిపుణుడిగా డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్నారు. అతడి ప్రేయసిగా పూజా అందచందాలు మైమరిపిస్తాయట.