Begin typing your search above and press return to search.

ఆ పార్టీలో ప్ర‌భాస్ ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   4 Oct 2015 3:56 AM GMT
ఆ పార్టీలో ప్ర‌భాస్ ఏం చేశాడు?
X
బాహుబ‌లి వ‌ల్ల మూడేళ్ల‌పాటు దేనికీ నోచుకోలేదు ప్ర‌భాస్‌. ఆఖ‌రికి ఫంక్ష‌న్ ల‌కు వెళ్లాల‌న్నా ఆ గెట‌ప్ ఎక్క‌డ బ‌య‌టికొస్తుందో, మీడియా కంట ఎక్క‌డ ప‌డ‌తామో అన్న భ‌యంతో మేగ్జిమ‌మ్ ఇంటికే ప‌రిమిత‌మైపోయేవాడు. బాహుబ‌లి త‌ర్వాతే మ‌ళ్లీ ఆయ‌న బ‌య‌టి ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భాస్ ఆనందానికి అవ‌ధులే లేవు. పార్టీల‌తోనూ - సెల‌బ్రేష‌న్స్‌ తోనూ స‌క్సెస్‌ ని మ‌స్తు మ‌స్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబ‌లి స‌క్సెస్ ఖాతాలో సొంతంగా రెండు మూడు పార్టీలిచ్చేశాడు. అలాగే బ‌య‌ట జ‌రిగే పార్టీల‌కి కూడా త‌ర‌చుగా హాజ‌ర‌వుతూ వ‌స్తున్నాడు. బాహుబ‌లి విజ‌య‌మే ఒకెత్త‌నుకొంటే ప్ర‌భాస్ త‌న సొంత సంస్థ‌లాంటి యువీ క్రియేష‌న్స్‌ కి భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ తో ద‌క్కిన హిట్టు మ‌రో ఎత్తు. దీంతో ఆ సినిమా త‌ర‌ఫున కూడా ప్ర‌భాస్ పార్టీలు ఇచ్చేశాడు.

స్నేహితుల‌తోనూ, సినిమా సెల‌బ్రిటీస్‌ తోనూ ఇలా వ‌రుస‌గా పార్టీలు చేసుకొంటూ ప్ర‌భాస్ స‌ర‌దా స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. ఇదే ద‌శ‌లో పూరి జ‌గ‌న్నాథ్ బ‌ర్త్ డే కూడా వ‌చ్చేసింది. ఇక పూరికీ - ప్ర‌భాస్‌ కీ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇద్ద‌రూ క‌లిసి ఒక‌ప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేశారు. ఒక‌ర్నొక‌రు డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకొంటుంటారు. పూరి త‌న బ‌ర్త్ డే ని పుర‌స్క‌రించుకొని ఇటీవ‌ల ఇచ్చిన పార్టీకి ప్ర‌భాస్ హాజ‌ర‌య్యాడు. ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రైన ఆ పార్టీకి ప్ర‌భాస్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌ గా మారాడ‌ట‌. అందులో ఓ పాట‌కి ఆయ‌న డ్యాన్స్ కూడా వేశాడ‌ని తెలిసింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌టికొచ్చేశాయ‌ట‌. అయితే బాగోదు అని వెంట‌నే వాటిని తొల‌గింప‌జేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భాస్‌ తోపాటు పూరికి గురువైన రామ్‌ గోపాల్ వ‌ర్మ కూడా పార్టీలో మ‌స్తు మ‌స్తుగా సంద‌డి చేశాడ‌ట‌. ఆ వీడియోల‌న్నీ నెటిజ‌న్ల‌ను కాసేపు అల‌రించాయ‌ని తెలిసింది.