Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఇంకో హీరో నైట్‌ పార్టీలో

By:  Tupaki Desk   |   15 Sep 2019 5:53 AM GMT
ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఇంకో హీరో నైట్‌ పార్టీలో
X
బాలీవుడ్ లో వ‌రుస పార్టీల‌తో సెల‌బ్రిటీ హంగామా అంతా ఇంతా కాదు. ఆ హ‌డావుడితో పోలిస్తే టాలీవుడ్ లో ఆ వాతావ‌ర‌ణం చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తుంటుంది. అయితే కాలంతో పాటే మార్పు. ఆ వాతావ‌ర‌ణం టాలీవుడ్ లోనూ చిన్న చిన్న‌గా మొద‌ల‌వుతోంది. స్టార్ హీరోలు అప్పుడ‌ప్పుడు ఒకచోట క‌లుసుకుని పార్టీలు చేసుకోవ‌డం.. ఆ ఫొటోల్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకోవ‌డం అనేది ఈ మ‌ధ్యే మొద‌లైంది. కొన్ని నెల‌ల క్రితం రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్‌- మ‌హేష్‌.. ఈ ముగ్గురూ క‌లిసి పార్టీ చేసుకున్న ఫొటోలు బ‌య‌టికి రావ‌డం తెలిసిందే. దీంతో హీరోలంతా టాలీవుడ్ లో కొత్త సంప్ర‌దాయానికి తెర లేపార‌ని అర్థ‌మైంది.

తాజాగా అలాంటి స‌న్నివేశ‌మే మ‌రోసారి చోటు చేసుకుంది. ఓ స్టార్ హీరో కోసం ఇద్ద‌రు బిగ్ స్టార్ లు పార్టీకి క‌లిసి రావ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఆ స్టార్స్ మ‌రెవ‌రో కాదు.. `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్ర‌భాస్‌.. త‌న‌దైన యాటిట్యూడ్ మ్యాన‌రిజంతో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌. ఇంత‌కీ ఈ హీరోలిద్ద‌రు క‌లిసి వెళ్లింది ఎక్క‌డికి అంటే..? హీరో గోపీచంద్ ఇంట్లో జ‌రిగిన బ‌ర్త్‌ డే వేడుక‌ల‌కు వెళ్లార‌ట‌.

గోపీచంద్ చిన్న కుమారుడు వియాన్స్ మొద‌టి పుట్టిన రోజును గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేశారు. ఈ వేడుక‌కు బ‌న్ని- ప్ర‌భాస్ ముఖ్య అతిధులుగా హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంతరించుకుంది. `వ‌ర్షం` స‌మ‌యం నుంచి ప్ర‌భాస్‌- గోపీచంద్ ల మ‌ధ్య స్నేహం చిగురించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆ బంధం అలాగే కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ తో పాటు గోపీచంద్ బ‌న్నీతోనూ స్నేహంగా ఉంటారు. త‌ర‌చూ పార్టీల్లో కూడా క‌నిపిస్తుంటారు. ఈ వాతావ‌ర‌ణం టాలీవుడ్ లో కొత్త సంకేతాల్ని అందిస్తోంది. మ‌హేష్‌- చ‌ర‌ణ్‌-బ‌న్ని-తార‌క్-ప్ర‌భాస్- గోపిచంద్ .. వీళ్లంతా క్లోజ్ గా ఇలానే పార్టీలు చేసుకుంటే అది అభిమానుల‌కు క‌న్నుల పండ‌గే.