చిట్టీ ప్రేమలో లేడీ రోబో!!

Fri Oct 19 2018 22:00:27 GMT+0530 (IST)

`రోబో`కి ఎమోషన్స్ పుడితే.. ప్రేమానురాగాలు కలిగితే ఎలా ఉంటుంది?  ఎలా ఉంటుందో `రోబో` సినిమాలో చూపించారు శంకర్. రోబోలకు కూడా మనసుంటుందని - ఐశ్వర్యారాయ్ లాంటి అందగత్తె కనిపిస్తే ఆటోమెటిగ్గా ప్రేమలో పడతాయని శంకర్ మహదాద్భుతంగా చూపించారు ఆ చిత్రంలో. అంతేకాదు.. తన మాట వినే ఓ రోబోల గుంపును సిద్ధం చేసుకుని భీకర విలన్ గా మారే చిట్టీ రోబోట్ ని చూపించి పెద్ద సర్‌ప్రైజ్‌నే ఇచ్చాడు. అందుకే ఈసారి సీక్వెల్ - ప్రీక్వెల్ కాని పార్ట్ 2లో ఏం చూపిస్తాడోనన్న ఉత్కంఠం అందరిలోనూ ఉంది. 2.ఓ తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ జనాల్లో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతోంది.చిట్టీ ఈజ్ బ్యాక్! అంటూ టీజర్ తో పెద్ద సర్ ప్రైజ్ నే ఇచ్చిన శంకర్ - అంతకుమించిన సర్ ప్రైజ్ ని ట్రైలర్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారని అర్థమవుతోంది. నవంబర్ తొలివారంలో ట్రైలర్ రానుంది. ఈలోగానే మచ్చుకు ఓ ఛమ్కీని వదిలారు. ఇదిగో ఈ ఫోటోలో లేడీ రోబోట్ ఎమీజాక్సన్ చిట్టీ రోబోట్ కి ఏదో వివరించి చెబుతున్నట్టే ఉంది. అసలింతకీ ఎమీజాక్సన్ విలన్ గుంపులో ఉంటుందా?  లేక క్రో మ్యాన్ ని ఎదురించే చిట్టీ గుంపులో ఉంటుందా? అన్నది తేలలేదింకా. ఎందిర లోగతు సుందరియా.. అంటూ సాగే ఓ లిరికల్ వీడియోని ఈ శనివారం నాడు విడుదల చేస్తున్నారు. నవాబ్ తర్వాత ఏ.ఆర్.రెహమాన్ నుంచి సర్కార్ ఆడియో వచ్చింది. అటుపై 2.ఓ ఆడియో సర్ ప్రైజ్ చేయబోతోంది.

ఈ ఫోటోలో చూస్తున్నదానిని బట్టి ఎమీజాక్సన్ పాత్ర కథానాయకుడి వైపేనని అర్థమవుతోంది. లేదంటే అందులోనే ఏదైనా ఊహించని ట్విస్టును శంకర్ చూపించబోతున్నాడా? అన్నది చూడాలి. ఇక్కడ చిట్టీ రోబోట్ కి అధునాతన సాంకేతిక విధానంపై గైడ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆ స్పెషల్ గాగుల్స్.. హై ఎండ్ జాకెట్స్.. ఆ అప్పియరెన్స్ అంతా చూస్తుంటే విజువల్ గా ఇంకెంత సర్ ప్రైజ్ ఉంటుందో అన్న ఎగ్జయిట్ మెంట్ పెరుగుతోంది. మొత్తానికి నవంబర్ 29న అసలు సిసలు ఫెస్టివల్ ఉందన్నమాట!!