Begin typing your search above and press return to search.

మహానటి నుంచి మహాపరిశ్రమకు

By:  Tupaki Desk   |   15 May 2018 11:37 AM GMT
మహానటి నుంచి మహాపరిశ్రమకు
X
సౌత్ లో ఎన్ని బాషల్లో సినిమాలు చేసినా బాలీవుడ్ లో చేస్తే వచ్చే గుర్తింపే వేరు. బాహుబలి ద్వారా ప్రభాస్ కు వచ్చిన పేరు దానికి మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా మనమెవరో తెలియాలంటే హింది సినిమా ఒక్కటే మార్గం. అందుకే చిరంజీవి-నాగార్జున-వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు మొదలుకుని రామ్ చరణ్ దాకా అందరూ అక్కడి స్ట్రెయిట్ సినిమాల్లో ఋజువు చేసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళే. అందుకే దాన్ని మహాపరిశ్రమ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సాగరంలోకి తాను దూకి ఈది గెలవడానికి సిద్ధ పడుతున్నాడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్. జెమినీ గణేషన్ గా కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించినప్పటికీ ఆయన వ్యక్తిత్వంలోని మంచితనాన్ని తన బాడీ లాంగ్వేజ్ ద్వారా పునఃప్రతిష్ట చేసిన దుల్కర్ నటనకు మనవాళ్ళు కూడా ఫిదా అయ్యారు. అయినా ఇది మొదటి సారి కాదుగా.మణిరత్నం ఓకే బంగారం సినిమా ద్వారానే అతని టాలెంట్ ఏంటో మన వాళ్ళు టేస్ట్ చేసారు.

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేసిన మొదటి హింది సినిమా కార్వాన్. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 10న విడుదల కానుంది. తీవ్రమైన వ్యాధితో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న ఇర్ఫాన్ ఖాన్ ఇందులో కీలక పాత్రధారి కాగా దుల్కర్ సల్మాన్ కు జోడిగా మిథిలా పాల్కర్ నటించింది. హింది సినిమానే అయినప్పటికీ దుల్కర్ ఇందులో బెంగళూరులో నివసించే కుర్రాడిగా కనిపిస్తాడు. అతనికి ఇర్ఫాన్ ఖాన్ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఇద్దరు ప్రేమికులు అతన్ని అండగా కోరుకుంటారు అనేది వెండితెరపై చూడాల్సిందే. కామెడీ కాన్సెప్ట్ తో ఎమోషనల్ గా వెరైటీ స్క్రీన్ ప్లే తో ఇది తీశామని చెబుతున్న దర్శకుడు ఆకర్ష్ ఖురానా ఆ వైవిధ్యం ఏంటో తెలియాలంటే విడుదల దాకా ఆగాల్సిందే అంటున్నాడు. ఇప్పటికే తమిళ్-తెలుగు-మలయాళం బాషలలో తన స్టామినా ఋజువు చేసుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు హింది వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. నాన్న మమ్ముట్టి చేయలేనిది కొడుకుగా బాలీవుడ్ లో తాను ఎంట్రీ ఇచ్చి చూపిస్తున్నాడు. ఇప్పటికే సౌత్ లో ఉన్న యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న దుల్కర్ కార్వాన్ కనక హిట్ అయితే మనకు దొరకడం కష్టమే