Begin typing your search above and press return to search.

చెర్రీ-పోసాని వర్సెస్ సూరీ- పోసాని

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:30 AM GMT
చెర్రీ-పోసాని వర్సెస్ సూరీ- పోసాని
X
పోసాని కృష్ణమురళి బేసిక్ గా రైటర్ - డైరెక్టర్ అయినా.. ఇప్పుడు యాక్టర్ గానే జనాలకు బాగా దగ్గరయ్యాడు. తన కెరీర్ లోనే బెస్ట్ స్టేజ్ లో ఉన్నాడని చెప్పాలి. సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా చేయడం విశేషం కాదు కానీ.. పోసాని చేస్తున్న కేరక్టర్స్ జనాలకు చాలా సంవత్సరాలు గుర్తుండిపోయేవిగా ఉంటున్నాయి. అంతటి ఇంపార్టెంట్ రోల్స్ కి.. తన స్టైల్ తో ప్రాణం పోస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించేస్తున్నాడు పోసాని.

రామ్ చరణ్-పోసాని కాంబినేషన్ లో నాయక్ సినిమాలో ఒకే ఒక సీక్వెన్స్ ఉంటుందంతే. కానీ ఆ మూవీ మొత్తానికి అదే హైలైట్ సీన్ అని చెప్పాలి. అంతగా ఆ రోల్ పండింది. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా పోసానిని బాగా ఉపయోగించుకున్నాడు. బన్నీతో రేసుగుర్రం మూవీలో హోమ్ మినిస్టర్ పాత్రలో పోసాని యాక్షన్ ని ఎవరూ మర్చిపోలేరు. ఇలా ఈ కాంబినేషన్స్ ఇప్పటికే నవ్వులు పంచాయి. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి చేస్తుండడం విశేషం.

తని ఒరువన్ ని తెలుగు రీమేక్ ని త్వరలో స్టార్ట్ చేయనున్నాడు చెర్రీ. ఇందులో విలన్ అరవింద్ స్వామికి తండ్రి పాత్ర ఉంటుంది. ఈ రోల్ ని పోసానితో చేయించాలని, చరణ్-సూరి ఫిక్స్ అయ్యారు. తమిళ్ లో తంబి రామయ్య చేసిన ఈ పాత్ర.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రను చేసేందుకు పోసాని కృష్ణమురళి కరెక్ట్ ఆప్షన్ అంటున్నారు. చూస్తుంటే.. పోసాని కెరీర్ లో చిరకాలం గుర్తుండిపోయే మరో పాత్రగా తనిఒరువన్ రీమేక్ లో చేసే రోల్ కూడా నిలవచ్చు.