Begin typing your search above and press return to search.

రవితేజ తమ్ముడితో పోసాని లింక్ అది

By:  Tupaki Desk   |   26 Jun 2017 12:49 PM GMT
రవితేజ తమ్ముడితో పోసాని లింక్ అది
X
ఇప్పుడు హీరో రవితేజ తమ్ముడు భరత్ యాక్సిడెంటులో చనిపోయిన విషయం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. అయితే ఈ సందర్భంగా అసలు భరత్ కు పెళ్లయ్యిందా.. పిల్లాపాపలు ఉన్నారా అనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామూలుగా రవితేజ ఫ్యామిలీలో రవితేజతో సహా ఎవ్వరి పర్సనల్ లైఫ్‌ ను కాస్త కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడరు. మరి భరత్ సంగతేంటి?

నిజానికి ఒకానొకప్పుడు భరత్ గురించి ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. తాను చెన్నయ్ లో పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసేటప్పుడు.. పరుచూరి వారు ఒక రూమిచ్చారని.. ఆ రూములో ఉన్నప్పుడు ఒకసారి భరత్.. శిరీష అనే ఒకమ్మాయిని తీసుకుని వచ్చాడని.. ఈమెను పెళ్ళి చేసుకోవాలి..మీరే సాయం చేయాలి అని అడిగాడని చెప్పాడు. అప్పటికి రవితేజ చిన్నాచితకా వేషాలతో స్ర్టగుల్ అవుతున్నాడులే. ఆ సమయంలో పోసాని భరత్ కు తన రూమిచ్చేసి.. మూడు రోజులపాటు తాను వేరే చోట పడుకున్నాడట. ఇదంతా పూర్తిగా తెలుసుకోని పరుచూరి ఫ్యామిలీ.. ఇంటికి అమ్మాయిలను తెచ్చాడు అంటూ మనోడ్ని అక్కడి నుండి తరిమేశారట. ఆ తరువాత పరుచూరి వారి మెట్లు ఎన్నడూ ఎక్కలేదు అంటూ పోసాని తెలిపాడు. ఇకపోతే భరత్ ఆ తరువాత ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని.. కాని వారు కలిసున్నారో లేదో తనకు తెలియదని కామెంట్ చేశాడు.

ఆ ఇంటర్యూను బట్టి పోసాని చెప్పినదాని బట్టి చూస్తే.. భరత్ కు ఎప్పుడో పెళ్ళయ్యిందనమాట. అయితే 46 ఏళ్ళ భరత్ ఈ మధ్యనే ఒకమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని.. ఆమె అమెరికాలో ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా కూడా నాటి పోసాని ఇంటర్యూ నుటడు భరత్ గురించి ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/