Begin typing your search above and press return to search.

తెలుగుదేశం మీది.. నీలాంటోడు ఎమ్మెల్యే కావాలి

By:  Tupaki Desk   |   21 March 2018 8:42 AM GMT
తెలుగుదేశం మీది.. నీలాంటోడు ఎమ్మెల్యే కావాలి
X
మ‌న‌సుకు అనిపించిందంతా చెప్పేసే మ‌నుషులు కొంత‌మంది ఉంటారు. ఎదుట ఎవ‌రున్నార‌న్న‌ది వాళ్లు ప‌ట్టించుకోరు. చుట్టూ ఉన్న జ‌నం గురించి అస్స‌లు ప‌ట్ట‌దు. తామేం చెప్పాల‌నుకుంటారో దాన్నే చెప్పేస్తారు. అలాంటి ల‌క్ష‌ణాలున్న సినీ ప్ర‌ముఖుడిగా పోసాని కృష్ణ‌ముర‌ళిగా చెప్పాలి.

ముఖం మీదనే తిట్టాల‌న్నా.. పొగ‌డాల‌న్నా ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా ఎమ్మెల్యే మూవీ ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణంగా సినిమా ఫంక్ష‌న్ల‌లో విప‌రీతంగా పొగిడేయ‌టం క‌నిపిస్తుంది. అంతేకానీ.. హీరోను నువ్వు అది అయిపో.. ఇది అయిపో అనేది దాదాపుగా ఉండ‌దు. కానీ.. పోసాని ఆ అడుగు వేసేశారు. క‌ల్యాణ్ రామ్ ను ఉద్దేశించి చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడిన పోసాని.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

చాలామంది హీరోలు అవుతార‌ని.. వేల కోట్ల రూపాయిలు సంపాదిస్తార‌న్నారు. దీనికి హ‌రికృష్ణ‌.. క‌ల్యాణ్ రామ్ లు భిన్న‌మ‌న్నారు. అందుకే క‌ల్యాణ్ రామ్ స‌క్సెస్ కావాల‌న్నారు. అన్నింటికి మించి రాజ‌కీయంగా క‌ల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావ‌టం త‌న‌కు ఇష్ట‌మ‌న్నారు.

ఎందుకా మాట తాను చెబుతున్నానంటే అని చెబుతూ.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వ‌స్తే ప్ర‌జ‌లు బాగుప‌డ‌తారు. స‌మాజం బాగుప‌డుతుంది అని వ్యాఖ్యాలు చేశారు. పోసాని మాట‌ల‌కు కంటిన్యూష‌న్ గా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ. పోసాని చెప్పిన‌ట్లు క‌ల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావాల‌ని చాలామంది కోరుకుంటార‌ని.. ఆయ‌న మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అన్న దానికి చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ అని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీలో కొత్త స‌మీక‌ర‌ణాలు తీసుకొచ్చే దిశ‌గా పోసాని తెలిసో.. తెలియ‌కో ఒక మాట అనేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.