Begin typing your search above and press return to search.

బోయపాటిని ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా..

By:  Tupaki Desk   |   21 Nov 2017 11:27 AM GMT
బోయపాటిని ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా..
X
పోసాని కృష్ణమురళి. ఒకప్పుడు ప్రఖ్యాత మాటల రచయిత. ఇప్పుడు మాటలు రాయడం మానేసి.. ఆయన సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. నంది అవార్డుల కాంట్రోవర్శీపై ఈయన ఏమంటాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మనోడు పేల్చిన బుల్లెట్టు బొబ్బున్న బుజ్జాయిలను కూడా తీసుకెళ్ళి పాతాళంలో పడేశాయి. పైగా తను కూడా రూలింగ్ పార్టీ సామాజిక వర్గమే.. తనకీ టెంపర్ సినిమాకు గాను అవార్డు వచ్చింది.. అయినా కూడా.. నారా లోకేష్‌ కామెంట్లకు తుప్పురేగిపోయే కౌంటర్లు వేశాడు. ముఖ్యంగా బోయపాటిపై మిస్సైల్స్ వదిలేశాడు.

దర్శకత్వంలో అమోఘమైన ప్రతిభ చూపించిన వారికి.. బిఎన్ రెడ్డి 'నంది' అవార్డును అందిస్తుంది ఏపి సర్కార్. అయితే ఈ అవార్డును ఇవ్వాలంటే.. ఆ దర్శకులు సామాజిక స్పృహ ఉన్న సినిమాలను తీయాలి. కాని 2016కు గాను బోయపాటి శ్రీనుకు ఈ అవార్డు రావడం.. అందరినీ కాసింత విస్మయానికి గురిచేసింది. సినిమా అంతా రక్తపాతం చూపించి.. లాస్టులో ఇది తప్పు అని చెప్పడం బోయపాటి వంతు. సరిగ్గా ఇదే పాయింట్ పై బోయపాటి పేరు చెప్పకుండా ఫుట్ బాల్ ఆడేశాడు పోసాని. ''దర్శకుడు ముత్యాల సుబ్బయ్యను ఉదాహరణగా తీసుకోండి. ఆయన సామాజిక స్పృహ సందేశం ఉన్న సినిమాలు ఎన్నోతీశారు. కలికాలం వంటి సినిమాను చూసి కె విశ్వనాథ్‌ మెచ్చుకున్నారు. సగటు మనిషి.. అమ్మాయి కాపురం.. అరుణ కిరణం.. అన్న.. పవిత్రబంధం.. పెళ్ళిచేసుకుందాం.. స్నేహితులు.. వంటి గొప్ప సినిమాలను సుబ్బయ్య తీస్తే.. ఈ బిఎన్ రెడ్డి అవార్డు వచ్చినోళ్ళు ఇందులో కనీసం రెండు గొప్ప సినిమాలైనా తీశారా? పక్క పక్కనే స్ర్కీనింగ్ వేసుకుని మీరే చూసుకోండి'' అంటూ కడిగిపాడేశాడు.

అదృష్టం కొద్దీ నాకు నంది వచ్చింది కాబట్టే.. నేను ఇవాళ మాట్లాడుగలుగుతున్నాను అంటూ పోసాని ఫైర్ అయ్యాడు. జ్యూరీలో అందరూ కమ్మవారే ఉంటే.. ఖచ్చితంగా కమ్మవారికే ఫేవర్ చేస్తారని డైరక్టుగానే చెప్పేశాడు. మరి పోసాని వ్యాఖ్యల పై నంది జ్యూరి.. నారా లోకేష్‌.. బోయపాటి శ్రీను ఎలా రెస్సాండ్ అవుతారో చూడాలి.