Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టపాకాయ్ పాప పేల్చేస్తోంది

By:  Tupaki Desk   |   26 Oct 2016 7:30 PM GMT
ఫోటో స్టోరి: టపాకాయ్ పాప పేల్చేస్తోంది
X
పూర్ణ అంటూ టాలీవుడ్ లో ఓ బ్యూటీ చెప్పుకోదగినన్ని సినిమాలే చేసింది. అసలు పేరు షమ్నా కాశిం అయినా.. స్క్రీన్ నేమ్ తోనే మనకు దగ్గరైంది ఈ బ్యూటీ. సీమ టపాకాయ్ మూవీతో పలకరించి.. అవును మూవీలో ట్యాలెంట్ చూపించేసి.. తనకు చాలానే మార్కులు వేయించుకున్న పూర్ణ.. భారీగా ఆఫర్లు ఒడిసిపట్టడంలో మాత్రం వెనకబడిపోయింది. అలాగని కెరీర్ ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేదు. తమిళంలో వరుసగా సినిమాలు చేసేస్తున్నా.. గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే టాలీవుడ్ లో నిలబడలేకపోవడం అమ్మడికి అస్సలు నచ్చలేదనుకుంటా.

చివరగా హారర్ మూవీ రాజుగారి గదిలో బొమ్మాళిగా కనిపించిన పూర్ణ... ఇప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ మళ్లీ స్పీడ్ పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. అలాగని శృతి మించడం.. డోస్ పెంచేసి ఓవర్ ఎక్స్ పోజింగ్ చేయడం లాంటివి కాకుండా.. అచ్చంగా అందాన్ని మాత్రమే నమ్ముకుంది. బ్లాక్ డ్రస్ లో కొద్దిగా క్లీవేజ్.. స్లీవ్ లెస్ లో చేతి మెరుపులు.. కట్స్ తో కాలి సొగసులు చూపిస్తే.. కొంచెం కొంచెంగా అందాలు ఆరబోస్తోంది పూర్ణ. అవకాశం రావాలి కానీ ఎలాంటి రోల్ అయినా సీమటపాకాయ్ లా పేల్చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇండికేషన్ ఇచ్చేసింది.

టాలీవుడ్ ఆడియన్స్ కి పూర్ణ కొత్త కాదు కానీ.. ఇక్కడ చేసినవన్నీ పద్ధతైన పాత్రలు కావడంతో అందాలమోత మాత్రం తక్కువే. మరిప్పుడు ఆ యాంగిల్ కూడా చూపించింది కాబట్టి.. ఆఫర్లు వెల్లువలా వచ్చేస్తే ఇక ఆ కోణంలోంచి కూడా సంపూర్ణంగా ట్యాలెంట్ చేసయచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/