పైకి నగ్న సంచలనాలు..లోపలేమో పెద్ద బిజినెస్!

Sun Jun 23 2019 10:55:49 GMT+0530 (IST)

మారే కాలంతో పాటు టెక్నాలజీలో.. జనాల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తాయి.  అది సహజంగా జరిగేదే. ఈమధ్య ఇన్స్టాగ్రామ్ వేదికగా అందాలభామలు తెగ రెచ్చిపోయి ఫోటోలు.. వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ భామలందరూ ఒక ఎత్తు అయితే పూనమ్ పాండే.. షెర్లీన్ చోప్రా లాంటి భామలు మరో ఎత్తు.  అందరూ భామలు జస్ట్ హాటు ఫోటోల దగ్గరే ఆగిపోతే ఈ పూనమ్.. షెర్లీన్లు మాత్రం న్యూడ్ వీడియోల బిజినెస్ మొదలు పెట్టారు.నిజానికి ఇన్స్టాగ్రామ్ రూల్స్ ప్రకారం ఫుల్ న్యూడిటీని అనుమతించరు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు ఆ న్యూడ్ ఫోటోలు.. వీడియోలు ఉండే ఖాతాను బ్లాక్  చేస్తారు.  అందుకే ఈ భామలు తెలివిగా తమ పేరుతో యాప్స్ లాంచ్ చేసి.. ఆ యాప్స్ లో న్యూడ్ కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నారు.  వాటికి ప్రమోషన్ గా ఇన్స్టాలో టీజర్.. ట్రైలర్లలాగా శాంపిల్స్ పెడుతున్నారు.  ఇక్కడ ఇన్స్టాలో ఏ..మీ ఉండదు.  ఈమధ్య పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో అందరినీ ఆకర్షించేందుకు పూనమ్ పాండే.. షెర్లీన్ చోప్రాలు న్యూడ్ వీడియోల ట్రిక్స్ ప్లే చేసింది అందుకే..!

వారేదో జస్ట్ టైమ్ పాస్ కోసం చేశారని అనుకుంటే మనం ఎ 1 గ్రేడ్ పప్పులమే.   మన జనాలు రెచ్చిపోయి వాటిని వైరల్ చేసి సదరు యాప్స్ కు భారీ పబ్లిసిటీ తెచ్చిపెట్టారు.  ఇక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి జస్ట్ "ది అఫీషియల్ పూనమ్ పాండే యాప్".. "షెర్లీన్ చోప్రా అఫీషియల్ యాప్" అని సెర్చ్ చేసి చూడండి.  పూనమ్ పాండే యాప్ కు వన్ మిలియన్ పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయి. షెర్లీన్ యాప్ కు 100k కు పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఆ యాప్స్ కింద ఉండే యూజర్ ఫీడ్ బ్యాక్ చూస్తే మీకు ఈ యాప్స్ నెటిజన్ల డబ్బును ఎలా గుంజుతున్నాయో అర్థం అవుతుంది.   యాప్స్ లోపల ఇన్-యాప్ పర్చేజెస్ పేరుతో 69 రూపాయల నుండి 6000 వరకూ రేట్స్ ఉన్నాయి.  లైవ్ చాట్..లై స్ట్రీమింగ్ లాంటివి చాలావరకు పెయిడ్.  

ఈ యాప్స్ ను ఫుల్ గా సమర్థించేవారు ఉన్నారు కానీ  కొందరు యూజర్లు మాత్రం "మా డబ్బును గుంజుతున్నారు మొర్రో" అని  మొత్తుకుంటున్నారు. ఒకరు "నేను యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా.  బయట ఇంటర్నెట్ లో ఉన్న న్యూడ్ వీడియోలే ఇక్కడ ఫ్రీ కంటెంట్ లో ఉన్నాయి. మిగతా అనీ పెయిడ్ వీడియోలే" అంటూ వాపోయాడు.   లోపల ఇంత కథ ఉంటే మన జనాలు మాత్రం "పాకిస్తాన్ పై విరుచుకు పడిన పూనమ్".. "ఫాదర్స్ డే రోజు హాట్ వీడియో రిలీజ్ చేసిన షెర్లీన్" అంటూ వారికి మరింతగా ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తూ వారి బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు! విషయం అర్థం అయిందిగా.. పూనమ్ పాండే.. షెర్లీన్ లు చేసేది ఘాటు బిజినెస్.