Begin typing your search above and press return to search.

మళ్లీ టాప్ లెస్ చూపించేసిందిగా!!

By:  Tupaki Desk   |   21 Sep 2017 1:18 PM GMT
మళ్లీ టాప్ లెస్ చూపించేసిందిగా!!
X
పూనమ్ పాండే సెన్సేషన్స్ గురించి.. ఎక్స్ పోజింగ్ గురించి డీటైల్డ్ గా చెప్పాలంటే పుస్తకాలు కాదు.. గ్రంథాలు అవసరమవుతాయేమో అనిపించక మానదు. ఎప్పటికప్పుడు తన స్టైల్ లో అందాలను తెగ ఆరబోసేస్తూ ఉంటుంది ఈ సెక్సీ బ్యూటీ. ఇంతకు మించి ఇక అందాల ప్రదర్శన చేయడం సాధ్యం కాదేమో అని.. ఎప్పటికప్పుడు అనిపించేలా చేయడంలో ఈమె తెగ ఆరితేరిపోయింది.

అయితే.. మళ్లీ కొత్త స్టైల్ లో అవే అందాలు ప్రదర్శనకు పెట్టేస్తూ అభిమానులను తెగ ఊరించేయడం పూనమ్ పాండేకు కొత్తేమీ కాదు. తాజాగా ఈ సుందరి తనపై తానే ఓ మొబైల్ యాప్ లాంఛ్ చేసుకుంది. మరి యాప్ అన్నాక ఇన్ స్టాల్స్ ఉండాలి.. రెగ్యులర్ వ్యూయర్స్ ఉండాలి కదా.. అందుకోసం ఫాలోయర్స్ ని.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులను టెంప్ట్ చేసేందుకు ఎన్ని రకాల ట్రిక్స్ ప్రయోగించాలో అన్నిటినీ వాడేస్తోంది. అన్నిటికీ పెట్టుబడి పూనమ్ అందాలే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. తాజాగా ఈమె ఓ టాప్ లెస్ ఫోటోను యాప్ లో పెట్టేసింది. ఇలా టాప్ లెస్ చూపించడం పూనమ్ పాండేకు ఇదేమీ మొదటిసారి కాదు కానీ.. ముందుగా చెప్పుకున్నట్లుగా అవే అందాలను కొత్తగా ప్రెజెంట్ చేయడంలోనే పూనమ్ తెలివితేటలు కనిపిస్తాయి.

ఓ చిన్నపాటి డిజైనర్ బాటమ్ తో.. టాప్ లెస్ గా కనిపిస్తున్నా.. తన అందాలకు కురులను అడ్డు పెట్టేసి.. కళ్లతో మత్తెక్కించే ప్రయత్నంలో పూనమ్ పాండే బాగానే సక్సెస్ అయింది. పూనమ్ చూపించే సెమీ న్యూడ్ పిక్చర్స్ కి డిమాండ్ బాగానే ఉంటోంది. అందుకే రోజురోజుకీ పూనమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. పైగా వీరిలో చాలావరకూ రెగ్యులర్ గా ఈమె పెట్టే అప్ డేట్స్ కోసం తెగ వెతికేసుకుంటున్నారట.