Begin typing your search above and press return to search.

వీధుల్లో టికెట్లు అమ్ముతున్న పూనమ్ పాండే

By:  Tupaki Desk   |   28 Aug 2015 1:41 PM GMT
వీధుల్లో టికెట్లు అమ్ముతున్న పూనమ్ పాండే
X
సినిమాను ప్రమోట్ చేయడంలో కొత్త కొత్త పద్ధతులు వచ్చేశాయి. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి వాళ్లు ప్రమోషన్ ను కొత్త పుంతలు తొక్కించారు. ఆ స్ఫూర్తితో మూవీ మేకర్స్ మరింత విభిన్నంగా సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ట్విట్టర్ హాట్ లేడీ పూనమ్ పాండే కూడా ఇప్పుడో కొత్త మార్గంలో ‘మాలిని అండ్ కో’ మూవీని ప్రమోట్ చేస్తోంది. తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమాకు సంబంధించిన టికెట్లను ఆమె స్వయంగా అమ్ముతుండటం విశేషం. ఐతే ఆమె ఏదో థియేటర్ కు వెళ్లి టికెట్ కౌంటర్ లో కూర్చుని టికెట్లు అమ్ముతోందనుకుంటే పొరబాటే. టికెట్లు పట్టుకుని నేరుగా వీధుల్లోకి వెళ్లిపోతోంది.

మాలిని అండ్ కో ఈ రోజే విడుదల కాగా.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లకు సంబంధించిన టికెట్లు పట్టుకుని వీధుల మీద పడింది పూనమ్. ఆ వీధుల్లో షాపుల్లోకి వెళ్లి ‘నేను పూనమ్ పాండే.. నా సినిమా చూడండి ప్లీజ్’ అని టికెట్లు అంటగట్టేస్తోంది. సినిమా చూస్తామో లేదో తర్వాత పూనమ్ లాంటి హాట్ బ్యూటీ చేతుల మీదుగా టికెట్లు ఇస్తుంటే కొనకుండా ఉంటారా జనం. కాబట్టి ఆమె చేతిలో ఉన్న టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం ఖాయం. ఐతే ఇలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల మీదా పూనమ్ ఓ లుక్కేస్తే బెటరేమో. కుదిరితే థియేటర్ల దగ్గరికెళ్లి ప్రతి షోకూ తనే టికెట్లమ్మితే రెస్పాన్స్ ఇంకా బాగుంటుందేమో. ఓ వారం రోజులు ఈ పనిలోనే ఉంటే.. ‘మాలిని అండ్ కో’ పెద్ద హిట్టయిపోతుందేమో!