భారత్ గెలిచినన్ని సార్లు విప్పేస్తానంది

Wed Jun 12 2019 13:42:59 GMT+0530 (IST)

సోషల్ మీడియా సెన్షేషన్ పూనం పాండే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈమె సినిమాల్లో నటించింది తక్కువే అయినా సోషల్ మీడియాలో చేసే సందడి ఎక్కువగా ఉంది. ఈ అమ్మడు గతంలో ప్రపంచ కప్ సందర్బంగా ఇండియా గెలిస్తే బట్టలు విప్పేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన పూనం పాండే ఆ తర్వాత మరింత రెచ్చి పోయింది.తాజాగా మరోసారి అదే తరహా ప్రకటన చేసింది. ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇండియా ఇప్పటికే రెండు లీగ్ మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇకపై ఆడబోతున్న మ్యాచ్ లలో ఇండియా గెలిస్తే  గెలిచిన ప్రతి సారి కూడా తన డ్రస్ విప్పేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈమద్య కాలంలో ఈమె న్యూడ్ వీడియోలు ఫొటోలు చాలా కామన్ అయ్యాయి.

గతంలో పూనం పాండే చేసిన ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని ప్రస్తుతం అంతగా ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు న్యూడ్ గా సెమీ న్యూడ్ గా కనిపించింది. ఈసారి కూడా బ్లాక్ టాప్ లో సెమీ న్యూడ్ ఫొటోను పోస్ట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండియా వరుసగా గెలుస్తున్న నేపథ్యంలో పూనం మరోసారి న్యూడ్ గా ఫొటోలకు ఫోజ్ ఇచ్చేందుకు సిద్దం అవ్వాలని నెటిజన్స్ మరియు క్రీడాభిమానులు అంటున్నారు.