పూనం కౌర్ పంతం నెగ్గిందా?

Sun Jan 21 2018 13:23:57 GMT+0530 (IST)

గత నాలుగు నెలలుగా హాట్ టాపిక్ గా మారిన కత్తి మహేష్ vs పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎట్టకేలకు సుఖాంతం అయితే అయ్యింది కాని చాలా ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు. టీవీ ఛానల్స్ లో దీనికి స్వస్తి పలికినట్టు ప్రస్తుతానికి కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ కొనసాగుతోంది. కత్తి మహేష్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు అడిగిన ఆరు ప్రశ్నలు - దానికి కౌంటర్ గా పవన్ ఫాన్స్ కత్తి మహేష్ గురించి సంధించిన ఏడు ప్రశ్నలకు సమాధానం ఒకరికి ఒకరు ఇచ్చుకున్నట్టు అనిపించినా కొంత స్పష్టత లోపించడం దేనికీ ఎవరు ఆధారాలు బయటికి చూపించకపోవడం సస్పెన్స్ కి పూర్తిగా తెరదించలేకపోయింది. ఇక కత్తి మహేష్ తన మీద విమర్శలు చేసినప్పుడు సైలెంట్ గా పూనం కౌర్ తన స్నేహితులతో కొద్ది రోజుల క్రితం కత్తి మహేష్ పబ్లిక్ గా టీవీ ఛానల్ లోనే సారీ చెబుతాను అని బలంగా చెప్పిందట .దానికి కారణం తాను ఏమనుకుని చెప్పిందో కాని అక్షరాల అది నిజం కావడం చూసి స్నేహితులు షాక్ తిన్నారట. దానికి దారి తీసిన పరిణామాలు ఏవైనప్పటికీ పూనం కౌర్ సరిగ్గా పది రోజుల్లో సారీ చెబుతాడు అని అంత నమ్మకంగా ఎలా చెప్పిందా అని ఆశ్చర్యపోతున్నారు. అంటే కత్తి మహేష్ పై ఒత్తిడి తీసుకొచ్చి చల్లబరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తనకు ముందే తెలిసిందా లేక కత్తి మహేష్ కు సంబంధించిన సమాచారం ఏదైనా తన దగ్గర ఉందా అనే దాని గురించి వాళ్ళలో వాళ్ళే చర్చించుకున్నారట. గతంలో ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ ఓ ట్వీట్ చేసి కొంతసేపటికే డిలీట్ చేసిన పూనం మళ్ళి ఆర్జివి జిఎస్టి ట్రైలర్ కు కత్తి మహేష్ మద్దతుగా మాట్లాడిన తరువాత సగటు మహిళా కన్నా పోర్న్ స్టార్ మీదే సానుభూతి ఎక్కువగా ఉందే అని పేరు ప్రస్తావించకుండా కౌంటర్ వేసింది పూనం.

మరి పూనంకు అంతా  ముందే తెలిసి సారీ ఊహించిందా లేక మ్యాటర్ ఎంత దూరం వెళ్ళినా చివరికి ఎలాగోలా రాజీ జరుగుతుందని ఊహించి అలా చెప్పిందా అనే దాని గురించి క్లారిటీ లేదు కాని ప్రస్తుతానికి మాత్రం పూనం చెప్పినట్టుగానే జరిగిందని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయి తనను అభినందించినట్టు టాక్. అవకాశాలు లేక బాగా వెనుకబడ్డ పూనం కౌర్ దీని వల్ల మళ్ళి లైం లైట్ లోకి వచ్చింది అన్నది మాత్రం నిజం.