పూనమ్ కౌర్ హాట్ అవతార్

Sun Jun 24 2018 11:20:47 GMT+0530 (IST)

దాదాపు పుష్కర కాలం నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తోంది పూనమ్ కౌర్. కానీ ఎప్పుడూ కథానాయికగా నిలదొక్కుకోలేదు. చిన్నా చితకా సినిమాలతోనే బండి లాగిస్తూ వచ్చింది. గత కొన్నేళ్ల నుంచి అయితే అసలామెకు అవకాశాలే లేవు. కానీ కొన్ని వివాదాల పుణ్యమా అని వార్తల్లో నిలుస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఆమె పేరు ముడిపడటం వల్ల మీడియాలో.. సోషల్ మీడియాలో మైలేజీ మాత్రం బాగానే వస్తోంది. ఆమె ట్విట్టర్లో ఏం మాట్లాడినా.. ఏం షేర్ చేసినా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మధ్య వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. పరోక్షంగా ఎవరి మీదో పంచులు వేయడం అలవాటుగా మార్చుకుందీ పంజాబీ భామ.

తాజాగా పూనమ్ తన పాత ఫొటో ఒకటి షేర్ చేసింది. అందులో క్లీవేజ్ అందాలతో ఊరిస్తోందామె. అందంగా కనిపిస్తూనే హాట్ క్లీవేజీతో మత్తెక్కిస్తున్న ఈ భామ.. కథానాయికగా ఓ మోస్తరు స్థాయిలో కూడా పేరు తెచ్చుకోలేకపోవడం ఆశ్చర్యమే. సినిమాల్లో ఆమె చాలా వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేస్తూ వచ్చింది. ఒకట్రెండు సినిమాల్లో తన హాట్ యాంగిల్ చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడామె గ్లామర్ దెబ్బ తినేసింది. పైగా లేనిపోని కాంట్రవర్శీలు చుట్టుముట్టేశాయి. దీంతో టాలీవుడ్లో కెరీర్ కు దాదాపుగా తెరపడిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీలో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో ఒక టీవీ సీరియల్లో నటిస్తోంది. వీటి తర్వాత పూనమ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.