Begin typing your search above and press return to search.

ఆ ద‌ర్శ‌కుడు న‌మ్మ‌కద్రోహి...పూన‌మ్ ట్వీట్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   25 May 2018 4:39 AM GMT
ఆ ద‌ర్శ‌కుడు న‌మ్మ‌కద్రోహి...పూన‌మ్ ట్వీట్ వైర‌ల్!
X
కొద్ది రోజులుగా త‌న ట్వీట్లతో న‌టి పూన‌మ్ కౌర్ వార్త‌ల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని ఓ ప్ర‌ముఖ దర్శకుడిని టార్గెట్ చేస్తూ పూన‌మ్....గ‌తంలో చేసిన ట్వీట్లు పెను దుమారం రేపాయి. తన సినిమాల‌లో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఓ ద‌ర్శ‌కుడు నిరాశ ప‌రిచాడ‌ని, అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న‌ను మోసం చేశాడ‌ని ఆరోపించింది. అంతేకాకుండా...ఓ ప్లాప్ హీరోయిన్ కు ఆ ద‌ర్శ‌కుడు త‌న సినిమాల్లో ప‌దే ప‌దే అవ‌కాశాలు ఇచ్చాడ‌ని ఆరోపించింది. ఇత‌రుల జీవితాల‌తో ఆ ద‌ర్శ‌కుడు ఆట‌లాడుతుంటాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత జీవితంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది. ఆ ద‌ర్శ‌కుడి ర‌హ‌స్యాలకు సంబంధించిన ఆధారాలు కూడా త‌న ద‌గ్గ‌రున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా, మ‌రోసారి పూన‌మ్ ఓ ద‌ర్శ‌కుడిని ఉద్దేశించి సంచ‌ల‌న ట్వీట్ చేసింది.` `జ‌ల్సాల‌లో ఉంటూ అజ్ఞాత‌వాసంలో ఏసేస్తాడు జాగ్ర‌త్త‌...# న‌మ్మ‌క‌ద్రోహి`` అంటూ పూనమ్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఆ ద‌ర్శ‌కుడు త‌న‌ను అవకాశాల పేరుతో మోసం చేశాడ‌ని పూన‌మ్ ఆరోపిస్తూ...న‌మ్మ‌క ద్రోహి అని అభివ‌ర్ణించింది. తాజాగా ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ ల కాంబోలో తెర‌కెక్కిన జ‌ల్సా, అజ్ఞాత‌వాసి చిత్రాల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దాంతోపాటు పూన‌మ్ మ‌రో ట్వీట్ చేసింది. ``ఆ నాలుగు కుటుంబాల‌కు అండ‌గా ఉండ‌డం....సో కాల్డ్ ఎన్నారై హీరోయిన్ల‌కు అవ‌కాశాలివ్వ‌డం ఆ ద‌ర్శ‌కుడికి అల‌వాటు. నాకు హిట్ లు లేవ‌ని అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని సాకులు చెప్పాడు. మ‌రి ఆ ఎన్నారై హీరోయిన్ల‌కు ఉన్నాయా? జ‌స్ట్ ఆస్కింగ్...ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన ప‌నులు బాగా చేస్తారని విన్నాను....``అంటూ పూన‌మ్ షాకింగ్ ట్వీట్ చేసింది. అయితే, ప‌వ‌న్ ఫ్యాన్స్, క‌త్తి మ‌హేష్ ల మ‌ధ్య వెర్బ‌ల్ వార్ టైంలో....పూన‌మ్ కు ప‌వ‌న్ కు మ‌ధ్య ఏదో ఉంద‌ని, జ‌ల్సాలో పార్వ‌తి మెల్ట‌న్ స్థానంలో పూన‌మ్ కు త్రివిక్ర‌మ్ చాన్స్ ఇస్తాన‌ని మోసం చేశాడ‌ని పుకార్లు వ‌చ్చాయి. ఇపుడు తాజాగా చేసిన ట్వీట్ లో కూడా ప‌వ‌న్ న‌టించిన సినిమాలుండ‌డంతో ప‌వ‌న్ ను పూన‌మ్ టార్గెట్ చేసింద‌ని పుకార్లు వ‌చ్చాయి. అయితే, ఓ ద‌ర్శ‌కుడు అంటూ పూన‌మ్ ప్ర‌స్తావించ‌డంతో ఆమె టార్గెట్ చేసింది త్రివిక్ర‌మ్ నేన‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అజ్ఞాత‌వాసి సినిమాలో కూడా ఎన్నారై అయిన అను ఇమ్మాన్యుయేల్ కు త్రివిక్ర‌మ్ చాన్స్ ఇచ్చాడ‌ని, ఆమెకు కూడా పెద్ద హిట్ లు లేవని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. అయితే, తాజా ట్వీట్ల‌తో ప‌వ‌న్ ను పూన‌మ్ టార్గెట్ చేయ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చింద‌ని, ఆమె టార్గెట్ త్రివిక్ర‌మ్ అని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే, త్రివిక్ర‌మ్, పూన‌మ్ ల మ‌ధ్య అస‌లు గొడ‌వ ఏమిటని...ఈ `అజ్ఞాత` ట్వీట్ల‌కు బ్రేక్ ఎపుడు ప‌డుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు.