Begin typing your search above and press return to search.

హాటీ కోసం 'పరుగు' పెట్టాల్సిందే

By:  Tupaki Desk   |   29 Sep 2016 7:30 AM GMT
హాటీ కోసం పరుగు పెట్టాల్సిందే
X
తన కెరీర్ లో 'మొదటి సినిమా'ని.. అదే టైటిల్ తో చేసే అదృష్టం దక్కించుకున్న హీరోయిన్ పూనమ్ బజ్వా. ఈ భామ తర్వాత కూడా తెలుగులో చేసింది కానీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పరుగుతో.. టాలీవుడ్ పరుగులు ఆపేసి.. కోలీవుడ్ లోకి వెళ్లిపోయింది.

ఇప్పుడీ పూనమ్ బజ్వా.. తన తెలుగు సినిమాలు ఆపేసినా.. టాలీవుడ్ జనాలను మాత్రం తన అందంతో పరుగులు పెట్టిస్తోంది. ఇదిలా ఉంటే... ఏటేటా లాంగ్ వెకేషన్ కు వెళ్లడం ఈమెకు చాలా ఇష్టం. ప్రతీ సారీ కొత్త ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరి అన్ని రోజులు అభిమానులు శాంతించాలి కదా.. అందుకనే అక్కడి నుంచి తన హాట్ హాట్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలా బీచ్ కి క్యాంప్ వేసిన ఈ భామ అక్కడి నుంచి రోజూ అప్ డేట్స్ పెట్టి మురిపిస్తోంది.

ఇప్పటికీ.. తమిళ్ మలయాళంలో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు చేస్తున్న పూనమ్ బజ్వా.. తెలుగులో మాత్రం నటించడం లేదు. ఇందుకు కారణం.. ఇక్కడ డైరెక్టర్ సునీల్ రెడ్డితో లవ్ స్టోరీనే కారణం అంటారు. అవన్నీ రూమర్స్ అనుకుందామని అనుకుంటే.. రీసెంట్ కా తేజు నటించిన తిక్క మూవీలో సునీల్ రెడ్డితో పాటే ఉండి దాదాపు రిలేషన్ కన్ఫాం చేసేసింది లెండి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/