సుకుమార్ అడిగాడనే ఆ రోల్ చేశా

Mon Mar 12 2018 10:08:57 GMT+0530 (IST)

టాలీవుడ్ లో హీరోయిన్ అడుగుపెట్టే వారిలో తెలుగు తెలిసిన వాళ్లు.. తెలుగు మాతృభాషగా ఉండేవారు చాలా తక్కువ మంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది. వాళ్లలో చాలామందికి గ్లామర్ డాల్స్ గా రాణించగల అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ దర్శక-నిర్మాతలు వేరే భాషల అమ్మాయిలకు ఇచ్చినంత ప్రాధాన్యం తెలుగు అమ్మాయిలకయితే ఇవ్వడం లేదనేది వాస్తవం.ఇన్ని అడ్డంకులు దాటి కొంతమంది అమ్మాయిలు వెండితెరపై తళుక్కున మెరుస్తున్నారు. అలా డైరెక్టర్ సుకుమార్ వెలుగులోకి తెచ్చిన అచ్చ తెలుగు అందం పూజిత పొన్నాడ. సుకుమార్ కథ అందించిన దర్శకుడు సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో పూజిత నటన సుకుమార్ కు బాగా నచ్చింది. అందుకే ఆమెకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టి జంటగా కనిపించే రోల్ ఆఫర్ చేశాడు. సుకుమార్ సినిమా కాబట్టి స్టోరీ కూడా తెలుసుకోకుండా ఈ రోల్ కు ఓకే చెప్పేశానంటోంది పూజిత.

‘‘సుకుమార్ ను నేను మార్గదర్శకుడిలా భావిస్తాను. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందమే. ఆయన అడిగారన్న ఒక్క కారణంతో రంగస్థలం సినిమా గురించి ఏమీ తెలుసుకోకుండా అందులో నటించేందుకు సైన్ చేశాను’’ అంటూ తన గురుభక్తిని చాటుకుంది పూజిత.  సుమంత్ అశ్విన్ - నీహారిక జంటగా వస్తున్న హ్యాపీ వెడ్డింగ్.. మారుతీ టాకీస్ బ్యానర్ లో వస్తున్న బ్రాండ్ బాబు సినిమాల్లోనూ పూజిత కనిపించనుంది. రంగస్థలంతో తన కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందని ఎంతో నమ్మకంతో ఉంది. ఆమె ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.